Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్‌లో ముగిసిన మనికా పోరాటం

Tokyo Olympics 2020 Day 3 Live Updates
Webdunia
సోమవారం, 26 జులై 2021 (14:54 IST)
జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో భాగంగా, టేబుల్ టెన్నిస్ విభాగంలో రెండు రౌండ్లు దాటి సంచ‌ల‌నం సృష్టించిన భారత క్రీడాకారిణి మ‌నికా బాత్రా పోరాటం మూడో రౌండ్‌లో ముగిసింది. ఆస్ట్రియా క్రీడాకారిణి సోఫియా పోల్క‌నోవా చేతిలో ఆమె 0-4తో దారుణంగా ఓడిపోయింది. 
 
ప్ర‌త్య‌ర్థి దూకుడైన ఆట ముందు మ‌నికా నిల‌వ‌లేక‌పోయింది. పోల్క‌నోవా 11-8, 11-2, 11-5, 11-7 తేడాతో సునాయాసంగా గెలిచింది. 30 నిమిషాలలోపే ఈ మ్యాచ్ ముగియ‌డం విశేషం. 
 
ఇదిలావుంటే, ప్రపంచ ఛాంపియన్ మెక్ మేరీ కోమ్ 51 కిలోల విభాగం మహిళల బాక్సింగులో ఆదివారం అరగొట్టారు. విజయంతో టోక్యో ఒలింపిక్స్‌ను ప్రారంభించింది. ఆదివారం డొమినికన్ రిపబ్లిక్ కు చెందిన హెర్నాండెజ్ గ్రేసియా మిగ్వెలినాను ఆమె.. 4–1 తేడాతో మట్టి కరిపించింది. 
 
ఒక్క రెండో రౌండ్ మినహా మిగతా అన్ని రౌండ్లలోనూ ఆధిపత్యం ప్రదర్శించి.. రౌండ్ ఆఫ్ 16ను గెలిచి ప్రి క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. ప్రి క్వార్టర్స్‌లో కొలంబియాకు చెందిన ప్రపంచ మూడో ర్యాంకర్ వాలెన్సియా విక్టోరియాను మేరీకోమ్ ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్ జులై 29న జరగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

తర్వాతి కథనం
Show comments