Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ : సానియా జోడీకి చుక్కెదురు

Advertiesment
వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ : సానియా జోడీకి చుక్కెదురు
, ఆదివారం, 4 జులై 2021 (10:55 IST)
వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో భారత టెన్నిస్ రారాణి సానియా మీర్జాకు ఓటమి ఎదురైంది. మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా-బెతానీ మాటెక్ శాండ్స్ జోడీ రెండో రౌండ్లో పరాజయం చవిచూసింది. శనివారం రాత్రి జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో రష్యా ద్వయం ఎలెనా వెస్నినా, వెరోనికా కుదెర్మెటోవా 6-4, 6-3తో సానియా, బెతానీ జోడీని ఓడించింది.
 
తొలి సెట్‌లో కాస్తో కూస్తో పోరాడిన సానియా జోడీ... రెండో సెట్‌లో మాత్రం ప్రత్యర్థి జోడీకి ఎదురునిలువలేకపోయింది. ఈ ఓటమితో వింబుల్డన్ మహిళల డబుల్స్‌లో సానియా పోరాటం ముగిసింది. 
 
ఇక ఆమె మిక్స్‌డ్ డబుల్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. రెండో రౌండ్ మ్యాచ్‌లో సానియా - రోహన్ బోపన్న జోడీ... బ్రిటీష్ జంట ఐడన్ మెక్ హ్యూ, ఎమిలీ వెబ్లీ స్మిత్‌తో తలపడనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ మరో భారీ క్రికెట్ స్టేడియం.. జైపూర్​లో నిర్మాణం