Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాణా హత్యకేసు.. సుశీల్ కుమార్‌పై రైల్వే వేటు

Webdunia
మంగళవారం, 25 మే 2021 (10:18 IST)
జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా హత్యకేసులో అరెస్ట్ అయిన దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్‌పై వేటుకు రైల్వే సిద్ధమైంది. రాణా హత్య తర్వాత పరారీలో ఉన్న సుశీల్‌ను ఢిల్లీ పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఆరు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.
 
అయితే నార్తరన్ రైల్వేలో సీనియర్ కమర్షియల్ మేనేజర్‌గా ఉన్న సుశీల్‌ కుమార్‌ను 2015లో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల స్థాయిలో క్రీడల అభివృద్ది కోసం ఛత్రసాల స్టేడియంకు ఓఎస్‌డీగా పంపింది. గతేడాదితో డిప్యుటేషన్ ముగియడంతో పొడిగించాలని సుశీల్ చేసిన విన్నపాన్ని ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో త్వరలోనే వెనక్కి వెళ్లి రైల్వేలో చేరాల్సి ఉంది. అంతలోనే సాగర్ రాణా హత్యకేసులో సుశీల్ అరెస్ట్ అయ్యాడు. 
 
రాణా హత్య కేసుకు సంబంధించిన నివేదిక ఆదివారం రైల్వే బోర్డుకు అందింది. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో రైల్వే విధుల నుంచి అతడిని సస్పెండ్ చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఒకటి, రెండు రోజుల్లో సుశీల్ సస్పెన్షన్‌కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

తర్వాతి కథనం
Show comments