ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 24 ఏళ్ల రెజ్లర్ మృతి చెందారు. ఈ ఘర్షణలో భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని మోడల్ టౌను ప్రాంతానికి చెందిన ఛత్రపాల్ స్టేడియం సమీపంలోని సుశీల్ కుమార్ ఇంట్లో సాగర్ మరియు అతని స్నేహితులు ఉంటున్నారు. వారిని ఖాళీ చేయమని సుశీల్ కుటుంబ సభ్యులు కోరారు. ఈ విషయంలో సుశీల్ కుటుంబ సభ్యులకు, రెంటుకు ఉంటున్న వారికీ మధ్య వాగ్వాదం జరిగింది.
నాలుగు గంటల సేపు ఇరు వర్గాల వరకు ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి 2 గంటల సమయంలో సుశీల్ ఇంటి సమీపంలో ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో 24 ఏళ్ల సాగర్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాల్పుల విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. దలాల్ (24) అనే యువకుడిని అరెస్ట్ చేసి.. పార్క్ చేసిన ఓ వాహనంలో బుల్లెట్లు లోడ్ చేసిన గన్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
కాల్పుల ఘటనలో సుశీల్ కుమార్ హస్తం ఉందని పోలీసులు నిర్దారింఛి అతడిపై కేసు నమోదు చేశారు. ఇక ఈ విషయంపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గురిక్బాల్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. సుశీల్ కుమార్ కోసం అతడి ఇంట్లో సోదాలు చేశామని, అక్కడ అతడు లేడని తెలిపారు. పోలీసులు బృందాలుగా విడిపోయి సుశీల్ కోసం గాలింపు చేస్తున్నట్లు తెలిపారు.