Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరం సహకరించడం లేదంటూ సంచలన ప్రకటన చేసిన సానియా మీర్జా

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (16:19 IST)
భారత టెన్నిస్ స్టార్, హైదరాబాద్ ఏస్ సానియా మీర్జా సంచలన ప్రకటన చేశారు. టెన్నిస్ ఆడేందుకు శరీరం సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. పైగా, ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్‌ సీజన్‌ చివరిదన్న సంకేతాలను ఆమె వెల్లడించారు. ప్రస్తుత సీజన్ తర్వాత రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో పాల్గొనబోతున్నట్టు తెలిపారు. ఉమెన్స్ డబుల్స్ విభాగంలో ఉక్రెయిన్‌కు చెందిన నదియా కిచెనోక్‌తో కలిసి ఈ టోర్నీలో పాల్గొంది. అయితే, తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైంది. 
 
ఆ తర్వాత ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తన టెన్నిస్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు ప్రకటించారు. "ఒకే.. నేను ఇకపై ఆడబోవడం లేదు" అని సింపుల్‌గా చెప్పలేనని చెప్పారు. టెన్నిస్ ఆడటం కోసం తన మూడేళ్ళ కుమారుడితో కలిసి తాను సుధీర్ఘ ప్రయాణాలు చేయాల్సి వస్తుందని, చిన్నారిని ఇబ్బంది పెట్టలేనని సోనియా చెప్పుకొచ్చారు. 
 
పైగా, తన శరీరం కూడా ఇంతకుముందులా సహకరించడం లేదని చెప్పారు. ఈ రోజున తన మోకాలు చాలా ఇబ్బంది పెట్టిందని అయితే, ఈనాటి ఓటమికి ఇదే కారణమని తాను చెప్పడం లేదని వ్యాఖ్యానించారు. అయితే, ఈ సీజన్ చివరివరకు ఆడాలని భావిస్తున్నానని, ఆ తర్వాత ఆటలో కొనసాగడం అసాధ్యమని సానియా స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

మనిషి మర్చిపోవడం సహజం.. కానీ ఎవరైతే అన్నం పెట్టారో : డిప్యూ సీఎం పవన్ (Video)

రేపు లోక్‌సభలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

తర్వాతి కథనం
Show comments