Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2022-ఢిల్లీకి కష్టాలు.. నలుగురు క్రికెటర్లకు కరోనా

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (15:44 IST)
ఐపీఎల్ 2022లో కరోనా కలకలం రేపుతోంది. నలుగురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఢిల్లీ జట్టుకు కష్టాలు తప్పేలా లేవు.  ఇప్పటికే ఢిల్లీ ఫిజియో ప్యాట్రిక్‌ ఫార్‌హర్ట్‌ పాజిటివ్‌గా తేలడంతో ఈ సీజన్‌లో తొలి కేసు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్‌ మార్ష్‌ కూడా సోమవారం ఆసుపత్రి పాలయ్యారు. ప్యాట్రిక్‌, మార్ష్‌ కాకుండా జట్టు డాక్టర్‌ అభిజిత్‌ సాల్వి, మసాజర్‌ కూడా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. మార్ష్‌ కాకుండా మిగతా ఆటగాళ్లందరికీ రెండు ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లోనూ నెగెటివ్‌గా వచ్చింది. దీంతో బుధవారం పంజాబ్‌తో ఢిల్లీ మ్యాచ్‌ను యధావిధిగా నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది. 
 
''మార్ష్‌కు తొలి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చింది. కానీ రెండో పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది. మిగతా ఆటగాళ్లందరూ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్‌గా తేలారు. ఢిల్లీ -పంజాబ్‌ మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు'' అని ఓ సీనియర్‌ బిసిసిఐ అధికారి తెలిపారు.
 
వివిధ జట్లలోని ఆటగాళ్లకు కరోనా సోకడంతో గతేడాది భారత్‌లో టోర్నీని వాయిదా వేసి.. అనంతరం సెప్టెంబర్‌- అక్టోబర్‌ మధ్యలో యుఎఇలో నిర్వహించిన సంగతి తెలిసిందే.  

సంబంధిత వార్తలు

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

ఏపీలో పోలింగ్ తర్వాత తిరుమలకు రేవంత్ రెడ్డి

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

చిన్న సినిమాలను బతికించండి, డర్టీ ఫెలో ప్రీ రిలీజ్ లో దర్శకుడు ఆడారి మూర్తి సాయి

కేన్స్‌లో పదర్శించిన 'కన్నప్ప‌' టీజర్ - మే‌ 30న తెలుగు టీజర్

తర్వాతి కథనం
Show comments