Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బాయిని వెతుక్కోమని అమ్మ చెప్పింది... నన్ను పెళ్లి చేసుకుంటావా..!!

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (11:21 IST)
భారత యువ క్రికెటర్‌పై ఓ యువతి మనస్సు పారేసుకుంది. తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రాధేయపడుతుంది. అబ్బాయిని వెతుక్కోవాలంటూ మా అమ్మ చెప్పింది. అందువల్ల నన్ను పెళ్లి చేసుకుంటావా అని భారత యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్‌ను ఓ యువతి చేతిలో ప్లకార్డును చట్టుకుని ప్రాధేయపడుతోంది. 
 
గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో తమ మనస్సులోని భావాలను ఆ యువతి బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోను కేకేఆర్ యాజమాన్యం తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. 
 
ఆ అమ్మాయి ప్రదర్శించి ప్లకార్డులో "అబ్బాయిని వెతుక్కోవమని మా అమ్మ చెప్పింది. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? శ్రేయాస్ అయ్యర్" అన్న అక్షరాలు రాసి ఉన్న ప్లకార్డులో ఆమె ఈ యువ క్రికెటర్‌కు పెళ్లి ప్రపోజల్ పెట్టింది. 
 
ఉత్కంఠ ఫోరులో రాజస్థాన్ విజయం - చాహల్ హ్యాట్రిక్ 
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 15వ సీజన్ పోటీల్లోభాగంగా సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. నరాలు తెగే ఉత్కంఠత మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధిచింది. తొలుత బ్యాట్స్‌మెన్ బట్లర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ చేయగా, ఆ తర్వాత చాహల్ హ్యాట్రిక్‌ వికెట్లు సాధించాడు. దీంతో కోల్‌కతా జట్టులో శాంసిన్, ఆరోన్ ఫించ్ చేసిన పోరాటం వృధాగా మిగిలిపోయింది. పైగా, ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డును చాహల్ అందుకున్నాడు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఈ సీజన్‌లో అత్యధికంగా 217 పరుగుల స్కోరు చేసింది. బట్లర్ ఈ సీజన్‌లో రెండో సెంచరీ బాదాడు. ఐపీఎల్‌లో అతడికి ఇది మూడో సెంచరీ. మొత్తంగా 61 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. అలాగే, పడిక్కల్ 24, సంజూ శాంసన్ 38, హెట్మెయిర్ 26 చొప్పున పరుగులు చేశారు. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో నరైన్ రెండు వికెట్లు పడగొట్టాడు. 
 
ఆ తర్వాత 2018 పరుగుల కొండంత విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా జట్టు 19.4 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఫించ్ 58, హెట్మయిర్ 0, శ్రేయాస్ అయ్యర్ 85, రాణా 18, రస్సెల్ 0, వెంకటేష్ 6, షెల్డన్ 8, మావి 0, కమ్మిన్స్ 0, ఉమేష్ 21, వరుణ్ 1, ఎక్స్‌ట్రాల రూపంలో 13 చొప్పున పరుగులు వచ్చాయి. రాజస్థాన్ బౌలర్లలో చాపల్ హ్యాట్రిక్‌తో ఏకంగా ఐదు వికెట్లు తీయగా, మెకాయ్ 2, ప్రసిద్ధ్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments