Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్చరీ నాలుగో వరల్డ్ కప్- రజతం సాధించిన భారత మహిళల జట్టు

ఆర్చర్ జ్యోతి సురేఖ మరోసారి సత్తా చాటింది. వరుసగా నాలుగో ప్రపంచకప్‌లోనూ భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన జ్యోతి సురేఖ రెండు పతకాలను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ప్రపంచకప్‌ స్టేజ్-4 టోర్నీలో సురేఖ, త్ర

Webdunia
ఆదివారం, 22 జులై 2018 (14:56 IST)
ఆర్చర్ జ్యోతి సురేఖ మరోసారి సత్తా చాటింది. వరుసగా నాలుగో ప్రపంచకప్‌లోనూ భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన జ్యోతి సురేఖ రెండు పతకాలను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ప్రపంచకప్‌ స్టేజ్-4 టోర్నీలో సురేఖ, త్రిషా దేబ్, ముస్కాన్‌‌లతో కూడిన భారత మహిళల జట్టు పాయింట్‌ తేడాతో స్వర్ణ పతకాన్ని చేజార్చుకుంది.


ఫైనల్లో భారత్‌ 228-229తో సోఫీ డోడ్‌మోంట్, అమెలీ సాన్‌ సెనోట్, సాండ్రా హెర్వీలతో కూడిన ఫ్రాన్స్‌ జట్టు చేతిలో పరాజయం పాలై రజత పతకాన్ని దక్కించుకుంది.
 
నాలుగు రౌండ్‌‌లపాటు జరిగిన ఫైనల్లో ఒక్కో రౌండ్‌‌లో ఒక్కో జట్టు ఆరేసి బాణాలు సంధించాయి. తొలి రౌండ్‌‌లో భారత్‌ 59-57తో పైచేయి సాధించగా… రెండో రౌండ్‌లో 57-59తో, మూడో రౌండ్‌లో 53-58తో వెనుకబడిపోయింది.

చివరిదైన నాలుగో రౌండ్‌లో భారత్‌ 59-55తో ఆధిపత్యం చలాయించినా ఓవరాల్‌గా ప్రత్యర్థి స్కోరుకు ఒక పాయింట్‌ దూరంలో ఉండిపోయింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments