Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

మోక్షం పేరిట పూజలు... 120 మంది మహిళలపై అత్యాచారం ఎక్కడ?

హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ జిల్లాలో ఓ దారుణం వెలుగు చూసింది. మోక్షం పేరిట ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని పలువురు మహిళను నమ్మించిన నకిలీ బాబా ఏకంగా 120 మంది మహిళలపై అత్యాచారం జరిపారు.

Advertiesment
Haryana
, శనివారం, 21 జులై 2018 (09:06 IST)
హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ జిల్లాలో ఓ దారుణం వెలుగు చూసింది. మోక్షం పేరిట ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని పలువురు మహిళను నమ్మించిన నకిలీ బాబా ఏకంగా 120 మంది మహిళలపై అత్యాచారం జరిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఫతేబాద్ తోహానా పట్టణానికి చెందిన 60 యేళ్ళ మాంత్రికుడు ఒకరు కాదు ఇద్దరు కాదు... ఏకంగా 120 మంది మహిళలపై అత్యాచారం చేయడమే కాకుండా వారందరి వీడియోలు చిత్రీకరించిన ఘటన సంచలనం రేపింది.
 
ఫతేబాద్ తోహానా పట్టణానికి చెందిన బాబా అమర్‌పురి అలియాస్ బిల్లు ఓ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. ఈయన తన ఆశ్రమానికి వచ్చే మహిళలతో మోక్షం పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించేవాడు. ఈ పూజలకు సమ్మతించిన మహిళలను ఒక ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి, మాయమాటలతో లోబరుచుకునేవాడు. ఆ తర్వాత ఆ మహిళను శారీరకంగా లొంగదీసుకునేవాడు. ఇలా 120 మంది మహిళలతో రాసలీలలు కొనసాగించాడు. 
 
అనంతరం ఆ దృశ్యాలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ వారిపై పలు సార్లు అత్యాచారం చేస్తూ వచ్చాడు. దీనిపై పలువురు బాధిత మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు... బాబా రాసలీలలు నిజమేనని తేలాయి. అలాగే, అత్యాచారానికి గురైన 120 మంది మహిళల వీడియో క్లిప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఫతేబాద్ మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్ బిమ్లాదేవి రంగంలోకి దిగి బాబా అమరపురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అత్యాచారానికి గురైన మహిళలను సంప్రదించి వారి వాంగ్మూలాన్ని రికార్డు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్...