Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. క్విక్ ఫార్వర్డ్ బటన్ ఇక వుండదు.. కేవలం ఐదుగురికే?

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ కొత్త ఫీచర్‌ను వినియోగదారుల అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం టెస్టులో వున్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు హెచ్చరించటం,

Advertiesment
WhatsApp
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ కొత్త ఫీచర్‌ను వినియోగదారుల అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం టెస్టులో వున్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు హెచ్చరించటం, భారత దేశం కూడా గట్టి వార్నింగ్ ఇవ్వడంతో వాట్సాప్ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే తప్పుడు వార్తలు వైరల్ కాకుండా.. వాట్సాప్ ద్వారా ప్రచారం కాకుండా కొత్త ఆప్షన్ తీసుకొస్తుంది. 
 
వాట్సాప్‌లో ఫార్వర్డ్‌ అ‍య్యే సమాచారంపై పరిమితి విధించింది. కేవలం ఐదు చాట్లకు మాత్రమే మెసేజ్‌ ఫార్వర్డ్‌ అయ్యేలా వాట్సాప్ నిర్దేశించింది. అదేవిధంగా మీడియా మెసేజ్‌లకు క్విక్‌ ఫార్వర్డ్‌ బటన్‌ను తీసేసింది. మన దేశంలోనే మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలు ఎక్కువగా ఫార్వర్డ్‌ అవుతున్నాయి. గ్రూప్స్ క్రియేట్ చేయటం, మల్టిపుల్‌ చాట్లకు మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేసుకునేలా ఫీచర్‌ను కొన్నేళ్ల క్రితమే తీసుకొచ్చింది వాట్సాప్‌. 
 
ప్రస్తుతం పెద్ద ఎత్తున్న తప్పుడు మెసేజ్‌లు ఫార్వర్డ్‌ అవుతూ హత్యలు, దాడులు, అరాచకాలకు దారితీయడంతో.. వాట్సాప్ ఈ కొత్త పద్ధతికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే వాట్సాప్ ద్వారా ఒకేసారి ఐదు గ్రూపులు లేదా వ్యక్తులకు మించి మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేయదు. కేంద్రం నోటీసులకు స్పందించిన వాట్సాప్‌, టెక్నాలజీని వాడుకుని, కొత్త ఫీచర్లతో ఫార్వర్డ్‌ మెసేజ్‌లను గుర్తిస్తామని, ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోదీ సర్కారు చేసిన మోసాన్ని తెలంగాణ ప్రజలు మరిచిపోరు: వినోద్