Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రొనాల్డో కంటే ఆ అమ్మాయే బెస్ట్.. అలాంటి వరల్డ్ కప్ కావాలి : ఆనంద్ మహీంద్రా

దేశంలోని పారిశ్రామిక దిగ్గజాల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. అయితే, అక్కడక్కడా జరిగే కొన్ని ఆసక్తికర సంఘటనలపై ఆయన స్పందిస్తుంటారు. ఆయన తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ద్విచక్రవాహనాల్లో ఇద్దరు అమ్

Advertiesment
రొనాల్డో కంటే ఆ అమ్మాయే బెస్ట్.. అలాంటి వరల్డ్ కప్ కావాలి : ఆనంద్ మహీంద్రా
, మంగళవారం, 26 జూన్ 2018 (10:58 IST)
దేశంలోని పారిశ్రామిక దిగ్గజాల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. అయితే, అక్కడక్కడా జరిగే కొన్ని ఆసక్తికర సంఘటనలపై ఆయన స్పందిస్తుంటారు. ఆయన తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ద్విచక్రవాహనాల్లో ఇద్దరు అమ్మాయిలు లాంగ్ డ్రైవ్‌కు వెళుతూ ఒక చోట ఆగుతారు.
 
ఆ సమయంలో అటుగా ఓ కారు వెళుతుంది. ఇందులో నుంచి ఓ ప్లాస్టిక్ బాటిల్‌ను రోడ్డుపై పడేస్తారు డ్రైవర్. దీన్ని గమనించిన ఓ అమ్మాయి.. ఓ తన్నుతన్ని.. ఆ బాటిల్ తిరిగి కారులో పడేలా అచ్చం ఫుట్‌బాల్ గేమ్‌లో గోల్ వేసినట్టుగా వేస్తుంది. దీనిపై ఆనందం మహీంద్రా స్పందించారు. 
 
'గోల్స్ వేయడంలో రొనాల్డో కంటే ఈ అమ్మాయే బెట్టర్. ఇలాంటి వరల్డ్ కప్‌ను చూడాలన్నదే నా కోరిక అంటూ పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ యువతిపై కారు డ్రైవర్ ఎలాంటి దావా వేయడని భావిస్తున్న'ట్టు ట్వీట్ చేశారు. ఆ వీడియోను మీరూ చూడండి.


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిఫా ప్రపంచ కప్ : 3-0 తేడాతో రష్యాపై ఉరుగ్వే విజయం