Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫిఫా ప్రపంచ కప్ : 3-0 తేడాతో రష్యాపై ఉరుగ్వే విజయం

రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ ఫుట్‌బాల్ కప్ పోటీల్లో ఉరుగ్వే జట్టు జోరు కొనసాగిస్తోంది. సోమవారం ఆతిథ్య రష్యాతో జరిగిన మ్యాచ్‌లో 3-0 తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. ఈ జట్టు తొలుత ఈజిప్టు

ఫిఫా ప్రపంచ కప్ : 3-0 తేడాతో రష్యాపై ఉరుగ్వే విజయం
, మంగళవారం, 26 జూన్ 2018 (10:20 IST)
రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ ఫుట్‌బాల్ కప్ పోటీల్లో ఉరుగ్వే జట్టు జోరు కొనసాగిస్తోంది. సోమవారం ఆతిథ్య రష్యాతో జరిగిన మ్యాచ్‌లో 3-0 తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. ఈ జట్టు తొలుత ఈజిప్టు, సౌదీ అరేబియాను ఓడించిన జోరును రష్యా మ్యాచ్‌లోనూ కొనసాగించింది.
 
రష్యాతో జరిగిన మ్యాచ్‌లో ఉరుగ్వే స్టార్ స్ట్రైకర్ లూయిస్ సూరెజ్(10నిమిషంలో), ఎడిన్సన్ కవానీ(90ని) గోల్ చేయగా, రష్యా మిడ్‌ఫీల్డర్ డెనిస్ చెర్షెవ్(23ని) సెల్ఫ్ గోల్ చేశాడు. ఈ విజయంతో గ్రూపు-ఎలో 9 పాయింట్లు సొంతం చేసుకుని అగ్రస్థానంలో నిలిచింది. ఈనెల 30న గ్రూపు-బి రన్నరప్‌తో ప్రీక్వార్టర్స్‌లో తలపడుతుంది. మరోవైపు తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఓటమి ఎదుర్కొన్న రష్యా(6) వచ్చే నెల 1న గ్రూపు-బి విజేతతో ఆడుతుంది. 
 
కాగా, ప్రపంచకప్‌లో అన్ని లీగ్ మ్యాచ్‌ల్లో గెలువడం ఉరుగ్వేకు ఇది తొలిసారి కావడం గమనార్హం. అలాగే, సూరెజ్ తర్వాత ఉరుగ్వే తరపున మూడు వేర్వేరు ప్రపంచకప్ (2010, 14, 18)లలో గోల్స్ చేసిన రెండో ఆటగానిగా కవానీ నిలిచాడు. ఈ ప్రపంచకప్‌లో ఉరుగ్వే ప్రత్యర్థులకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా అడ్డుకోగలిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిఫా 2018 : పొలాండ్‌పై కొలంబియా విజయం