Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలు అదుర్స్‌ : ఆసియాకప్‌ విజేత భారత్‌

భారత హాకీ మహిళలు దుమ్మురేపారు. అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోమని నిరూపించారు. తిరుగులేని ప్రదర్శనతో ఆసియాకప్‌ కైవసం చేసుకొని రికార్డు సృష్టించారు. ఆదివారం జపాన్‌లోని కకామిగహరలో నువ్వానేనా అన్నట్టు జరిగిన ఫ

Webdunia
సోమవారం, 6 నవంబరు 2017 (09:01 IST)
భారత హాకీ మహిళలు దుమ్మురేపారు. అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోమని నిరూపించారు. తిరుగులేని ప్రదర్శనతో ఆసియాకప్‌ కైవసం చేసుకొని రికార్డు సృష్టించారు. ఆదివారం జపాన్‌లోని కకామిగహరలో నువ్వానేనా అన్నట్టు జరిగిన ఫైనల్లో భారత్‌ షూటౌట్‌లో 5-4తో చైనాను చిత్తుచేసింది. 
 
నవ్‌జ్యోత్‌ కౌర్‌ (25వ నిమిషంలో)గోల్‌ చేయడంతో తొలుత టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత తియాన్‌తియాన్‌ లువో (47వ ని)లో గోల్‌ కొట్టడంతో చైనా 1-1తో స్కోర్‌ సమంచేసింది. మ్యాచ్‌ ముగిసేసరికి మరో గోల్‌ నమోదు కాకపోవడంతో షూటౌట్‌ అనివార్యమైంది. ఉత్కంఠభరితంగా సాగిన షూటౌట్‌ రెండు జట్లు 4-4తో నిలిచాయి.
 
చివరి అవకాశంలో కెప్టెన్‌ రాణి గోల్‌ కొట్టింది. ఆ తర్వాత చైనా విఫలంకావడంతో భారత్‌ 5-4తో చైనాకు షాకిచ్చింది. గ్రూప్‌ దశలోనూ చైనాను భారత జట్టు చేతిలో ఓడిపోయిన విషయం తెల్సిందే. ఈ టోర్నీలో అమ్మాయిల జట్టు అద్భుతంగా ఆడింది. గ్రూప్‌ దశను అజేయంగా ముగించింది. క్వార్టర్‌లో కజకిస్థాన్‌పై గెలిచింది. సెమీ ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జపాన్‌ను మట్టికరిపించింది. 
 
ఉత్కంఠతగా సాగిన మ్యాచ్‌లో చైనాను ఓడించి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో అమ్మాయిలు, అబ్బాయిలు ఆసియాకప్‌ గెలిచినట్టైంది. ఆసియాకప్‌ విజేతగా నిలిచిన భారత్‌ 2018లో జరిగే మహిళల ప్రపంచకప్‌కు నేరుగా అర్హత పొందింది. 2004 తర్వాత అమ్మాయిలు ఆసియాకప్‌ గెలవడం ఇదే తొలిసారి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అరకు వ్యాలీలో అద్దంలాంటి రహదారులు... డిప్యూటీ సీఎంపై ప్రశంసలు

ఏపీ ఫైబర్‌ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులపై వేటు.. జీవీ రెడ్డి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

తర్వాతి కథనం
Show comments