Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మకానికి ఎయిరిండియా ఆస్తులు

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థల్లో ఒకటైన ఎయిరిండియా నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంస్థకు రూ.50 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ఇటీవలే నిర్వహణ ఖర్చుల కోసం రూ.1500 కోట్లను రుణంగా కూడా తీసుకుంది. అయితే, అ

Advertiesment
Air India
, ఆదివారం, 5 నవంబరు 2017 (16:47 IST)
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థల్లో ఒకటైన ఎయిరిండియా నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంస్థకు రూ.50 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ఇటీవలే నిర్వహణ ఖర్చుల కోసం రూ.1500 కోట్లను రుణంగా కూడా తీసుకుంది. అయితే, అప్పుల ఊబినుంచి గట్టెక్కేందుకు ఆ సంస్థ చేయని ప్రయత్నమంటూ లేదు. 
 
ఇందులోభాగంగా, తన ఆస్తులను అమ్మకానికి పెట్టింది. రూ.50 కోట్ల విలువ చేసే రెండు ఆస్తులను స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు అమ్మనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించి ఇరు వర్గాల మధ్య చర్చలు పూర్తయ్యాయి. 
 
ఎయిరిండియాకు సంబంధించిన కొన్ని వాటాలను అమ్మడం ద్వారా నష్టాల నుంచి గట్టెక్కించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు నిర్వహణలేని ఆస్తులను అమ్మడంతో నష్టాలను కొంతమేరైనా పూడ్చుకోవచ్చన్నది ఎయిరిండియా ఆలోచనగా ఉంది. 
 
దీంతో ఆర్థిక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న ఎయిరిండియా.. ఆస్తుల విక్రయానికి సంబంధించి ఎస్.బి.ఐతో చర్చలు జరిపింది. ఈ చర్చలు ఫలప్రదం కావడంతో దక్షిణ ముంబైలోని రెండు రెసిడెన్షియల్‌ ఆస్తులను ఎస్బీఐకు అమ్మింది. దీనికి సంబంధించి కార్యచరణ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. నష్టాల బాటలో పయనిస్తోన్న ఎయిరిండియా సుమారు రూ.50వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. మూలధన అవసరాల కోసం ఇటీవల రూ.1,500 కోట్ల రుణాన్ని కూడా తీసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉపయోగం లేని ప్రసంగాలు ఆపండి : రాహుల్ ట్వీట్