Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిఫా వరల్డ్ కప్‌- జర్మనీకి షాక్.. సెర్బియా శుభారంభం

ఫిఫా వరల్డ్ కప్‌లో ప్రపంచ నెంబర్ వన్ జర్మనీకి అనుకోని పరాజయం ఎదురైంది. తొలి మ్యాచ్‍‌లోనే ఆ జట్టును మెక్సికో మట్టికరిపించింది. ఆదివారం జరిగిన గ్రూఫ్‌-ఎఫ్‌ మ్యాచ్‌లో మెక్సికో 1-0తో జర్మనీని మట్టికరిపించ

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (14:09 IST)
ఫిఫా వరల్డ్ కప్‌లో ప్రపంచ నెంబర్ వన్ జర్మనీకి అనుకోని పరాజయం ఎదురైంది. తొలి మ్యాచ్‍‌లోనే ఆ జట్టును మెక్సికో మట్టికరిపించింది. ఆదివారం జరిగిన గ్రూఫ్‌-ఎఫ్‌ మ్యాచ్‌లో మెక్సికో 1-0తో జర్మనీని మట్టికరిపించిది. ఈ మ్యాచ్‌లో లొజానో.. 35వ నిమిషంలో చేసిన గోల్‌ మెక్సికోను విజయపథంలో నడిపించింది. 
 
ఇక మెక్సికో తాను ఆడిన గత ఆరు ప్రపంచకప్పుల్లోనూ నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. ఈసారి కూడా ముందంజ వేయడం దాదాపుగా ఖాయమని తెలుస్తోంది. కానీ నాకౌట్‌ చేరాలంటే జర్మనీ ఆట తీరు మాత్రం చాలా మెరుగుపడాల్సి వుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఇంకా స్వీడన్‌, దక్షిణ కొరియాలతో ఆ జట్టు తలపడాల్సి వుంది. గత రెండు ప్రపంచకప్‌లలో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించడం జర్మనీని కలవర పెట్టే అంశం.  
 
మరోవైపు ఫిఫా వరల్డ్ కప్‌లో సెర్బియా శుభారంభం చేసింది. అలెగ్జాండర్‌ కొలరోవ్‌ సంచలన ఫ్రికిక్‌ గోల్‌తో ఆదివారం జరిగిన గ్రూప్‌-ఈ మ్యాచ్‌లో 1-0తో కోస్టారికాపై విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో అత్యుత్తమ గోల్‌ అవకాశం కోస్టారికాకే వచ్చింది. ఈ టోర్నీకి ముదు సెర్బియా తాను ఆడిన గత ఆరు ప్రపంచకప్పుల్లో ఒకే విజయం సాధించడం విశేషం. ఈ విజయంతో గ్రూప్‌ నుంచి నాకౌట్‌ రేసులో సెర్బియా ముందు నిలిచింది. ఈ జట్టు ఇంకా బ్రెజిల్‌, స్విట్జర్లాండ్‌లతో మ్యాచ్‌లు ఆడాల్సివుంది.

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments