Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిస్టర్ హెగ్డే... మీరు హిట్లర్‌కి పునర్జన్మా? ప్రకాష్ రాజ్

కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత అనంతకుమార్ హెగ్డేపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు.

Advertiesment
మిస్టర్ హెగ్డే... మీరు హిట్లర్‌కి పునర్జన్మా? ప్రకాష్ రాజ్
, గురువారం, 7 డిశెంబరు 2017 (16:26 IST)
కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత అనంతకుమార్ హెగ్డేపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు. ఓ సందర్భంలో హెగ్డే మాట్లాడుతూ హిందూత్వం, జాతీయత రెండూ సమాన అర్థాన్నిస్తాయంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. 
 
ఈ విషయంపై ఆయన ట్విట్టర్ వేదికగా ఓ కామెంట్స్ చేశారు. 'మిస్టర్.. అనంతకుమార్ హెగ్డే, నేషనలిజమ్, హిందూత్వం రెండూ వేరు కాదు... వాటి అర్థం ఒకటే అని మీరు అన్నారు. అసలు నేషనలిజమ్‌లోకి హిందూత్వాన్ని ఎందుకు తీసుకొచ్చారు? మరి హిందూస్ కాని వారి మాటేంటి? 
 
మన దేశానికి గర్వకారణమైన అంబేద్కర్, అబ్దుల్ కలాం, ఏఆర్ రెహ్మాన్, కుష్వంత్ సింగ్, అమృతా ప్రీతమ్, డా.వర్గీస్ కురియన్.. తదితరులు అలాగే నావంటి మతంలేని, మానవత్వాన్ని నమ్మే వారందరి మాటేంటి? మేమంతా మన దేశ జాతీయులంకాదా? ఎవరు మీరు.. మీ అజెండా ఏంటి.. మీరు జన్మలను నమ్ముతారు కదా.. మీరంతా జర్మన్‌కి చెందిన హిట్లర్‌కి పునర్జన్మా?" అంటూ నిలదీశారు. 
 
కాగా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందిన అనేక మంది సీనియర్ నేతలు నేతలు ఇతర మతాలను కించపరుసూత హిందూమతాన్ని తలకెత్తుకున్న విషయం తెల్సిందే. దీంతో బీజేపీ నేతలు విమర్శలుపాలవుతున్నారు. ఈ కోవలనే అనంతకుమార్ హెగ్డే విమర్శలు ఎదుర్కొంటున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12న #Agnyaathavaasi 'గాలి వాలుగ‌...' పాట రిలీజ్