కళాకారులపై దాడులు చేస్తారా? ఏంటిది: ప్రకాష్ రాజ్ ప్రశ్న
బాలీవుడ్ నటి దిపికా పదుకొనే నటించిన పద్మావతి సినిమా వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. అనుమతి కోసం సమర్పించిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందంటూ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీకి సెన్సారు బోర్డు తిరిగి పంపింది. ప
బాలీవుడ్ నటి దిపికా పదుకొనే నటించిన పద్మావతి సినిమా వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. అనుమతి కోసం సమర్పించిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందంటూ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీకి సెన్సారు బోర్డు తిరిగి పంపింది. పద్మావతిలో అభ్యంతరకర దృశ్యాలను తొలగించాలంటూ రాజ్పుట్ నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 1న రిలిజ్ అవ్వాల్సిన పద్మావతి సినిమా కాస్త ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. దీపికా పదుకొనే నటించిన ''పద్మావతి' సినిమాను విడుదల చేస్తే విధ్వంసం సృష్టిస్తామంటూ రాజ్‌పుత్ కర్ణిసేన చేస్తున్న వ్యాఖ్యలను సినీనటుడు ప్రకాశ్ రాజ్ తప్పుబట్టారు. కళాకారులపై దాడులకు పాల్పడతామని చేస్తున్న హెచ్చరికలు ఆందోళన కలిగించేలా ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు.
అయితే అన్ని భాషల్లోనూ యథేచ్ఛగా వస్తున్న అశ్లీల చిత్రాలను ఖండించని వారు చారిత్రాత్మక సినిమాలో నటించిన కళాకారులపై దాడులకు పాల్పడతామంటూ హెచ్చరించడం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. కాగా.. కర్ణిసేన పద్మావతిలో నటించిన దీపికా పడుకొనే ముక్కుకోయాలని, ఆమెను చంపితే రూ.5 కోట్లు ఇస్తామని కర్ణిసేన ప్రకటించిన విషయం తెలిసిందే.