Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెంచ్ సైక్లిస్ట్ అద్భుత ఫీట్.. 33 అంతస్తులను సైకిల్‌పై ఎక్కి ఔరా అనిపించాడు..

Webdunia
మంగళవారం, 26 జనవరి 2021 (13:42 IST)
French Cyclist
ఫ్రైంచ్‌ సైక్లిస్ట్‌ అసాధారణ ఫీట్‌తో ఔరా అనిపించాడు. 33 అంతస్తులను సైకిల్‌పై అవలీలగా అరగంటలోనే చేరుకున్నాడు. సైక్లిస్ట్‌, మౌంటెన్‌ బైకర్‌ అరిలిన్‌ ఫాంటెనయ్‌ ట్రినిటీ టవర్‌లో 33 అంతస్తుల్లోని 768 మెట్లను కాలిని కిందపెట్టకుండా సైకిల్‌పైనే ఎక్కాడు.
 
33వ ఫ్లోర్‌కు చేరుకున్న తర్వాత కాలు కిందపెట్టిన అరిలిన్‌ సైకిల్‌ను తన భుజాలపైకి ఎత్తుకున్నాడు. పుటిక్స్‌లో కొత్తగా ప్రారంభమైన ఆకాశహార్మ్యం ట్రినిటీ టవర్ అరిలిన్‌ అసాధారణ టాస్క్‌కు వేదికగా నిలిచింది.
 
అరిలిన్‌ 33 అంతస్తులను సైకిల్‌పై చేరుకున్న వీడియో వైరల్‌ అవుతోంది. చివరి అంతస్తును చేరుకునే సమయంలో మెటల్‌ ఫ్లోరింగ్‌ జారుడుగా ఉండటంతో కొంత తడబడినట్టు వీడియోలో కనిపించింది. 
 
33 అంతస్తులను ఎక్కాలని తాను చేపట్టిన ఛాలెంజ్‌ విజయవంతమవుతుందని అనుకోలేదని, ఎక్కువ ఫ్లోర్‌లు ఎక్కుతున్న కొద్దీ తన భుజాలు, కాళ్ల కింద నొప్పి తీవ్రమైందని అరిలిన్‌ చెప్పుకొచ్చాడు. చివరి అంతస్తుకు చేరుకోగానే ఎలాంటి పొరపాట్లు చేసేందుకు అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళ్లానని ఈ ఫీట్‌ సాధించడం పట్ల సంతోషంగా ఉన్నానని అన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

తర్వాతి కథనం
Show comments