Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత పర్యటనకు ఇంగ్లండ్ జట్టు... 27న నేరుగా క్వారంటైన్‌కు..?

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (15:18 IST)
ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. జనవరి 27న భారత్ పర్యటనకు రానున్న ఇంగ్లాండ్ జట్టు.. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండనుంది. ఫలితంగా చెన్నై వేదికగా ఫిబ్రవరి 5న ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ముందు.. ప్రత్యర్థి జట్టుకు మూడు రోజులు మాత్రమే శిక్షణ సమయం ఉంటుంది. క్వారంటైన్ కోసం చెన్నైలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో బయోబబుల్ను ఏర్పాటు చేసింది బీసీసీఐ. 
 
ప్రస్తుతం ఇంగ్లాండ్-శ్రీలంక మధ్య సిరీస్ 26న ముగుస్తుంది. అయితే ఈ సిరీస్లో భాగం అవ్వని ఇంగ్లాండ్ క్రికెటర్లు బెన్‌ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, రోరీ బర్న్స్‌ ఇప్పటికే ఆదివారం రాత్రి భారత్కు చేరుకుని క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఫలితంగా.. వీరికి ఆరు రోజుల క్వారంటైన్ను ముగియగానే ప్రాక్టీస్ చేయడానికి ఐదురోజుల సమయం దొరుకుతుంది.
 
భారత్ ఆటగాళ్లు కూడా ఇంగ్లాండ్ జట్టుకు కేటాయించిన హోటల్లోనే 27వ తేదీన క్వారంటైన్లోకి వెళ్లిపోతారు. ఇరు జట్లకు ఈ ఆరు రోజుల క్వారంటైన్ సమయంలో మూడు సార్లు వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో నెగటివ్గా తేలితేనే ఆటగాళ్లు మ్యాచులో పాల్గొంటారు. 
 
లాక్డౌన్ తర్వాత భారత గడ్డపై జరగనున్న తొలి క్రికెట్ నేపథ్యంలో అనేక జాగ్రత్తల నడుమ సమరానికి రంగం సిద్ధం చేసింది బీసీసీఐ. సిరీస్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తోంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments