Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రుడిపై మట్టి, రాతి నమూనాలు తెచ్చిన చైనా వ్యోమనౌక

చంద్రుడిపై మట్టి, రాతి నమూనాలు తెచ్చిన చైనా వ్యోమనౌక
, గురువారం, 17 డిశెంబరు 2020 (10:47 IST)
చంద్రుడిపై మట్టి, రాతి నమూనాలతో చైనా వ్యోమనౌక చాంగె-5 క్షేమంగా భూమిని చేరింది. బుధవారం అర్థరాత్రి తర్వాత ఇన్నర్‌ మంగోలియాలో ప్యారాశ్చూట్‌ సహాయంతో క్యాప్సూల్‌ భూమిని తాకింది. గురువారం వేకువ జామున పరిశోధనా సిబ్బంది క్యాప్యూల్స్‌ను రికవరీ చేసుకున్నారు. ఈ నెల 1న చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన చాంగె-5 రెండు మీటర్ల వరకు తవ్వి సుమారు రెండు కిలోల నమూనాలను సేకరించింది.
 
చందుడ్రిపై మట్టి నమూనాలు తీసుకురావడం గత నాలుగు దశాబ్దాల్లో ఇదే తొలిసారి. 1976లో సోవియట్ యూనియన్ పంపించిన లూనా 24 తర్వాత భూమి పైకి చంద్రుడి నమూనాలను మోసుకువచ్చింది. ఈ మిషన్‌ ద్వారా భవిష్యత్‌లో చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడి ఉపరితలంపై వాతావరణ పరిస్థితులను మరింత లోతుగా అధ్యయనం చేసే వీలు కలుగనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 509 కేసులు