Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌లో విషాదం.. నేల కూలిన విమానం.. ఫుట్‌బాల్ ఆటగాళ్ల మృతి

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (12:13 IST)
బ్రెజిల్‌లో విషాదం నెలకొంది. టొక్టానిన్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విమాన ప్రమాదంలో నలుగురు ఫుట్​బాల్ ఆటగాళ్లు మరణించారు. జట్టు అధ్యక్షుడితో పాటు పైలట్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. దక్షిణాది రాష్ట్రమైన టొకాన్టిన్​లో ఈ ఘటన జరిగిందని టీం యాజమాన్యం వెల్లడించింది. విమానంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని తెలిపింది. 
 
టేకాఫ్ అయ్యే సమయంలో విమానం ఒక్కసారిగా నేలమీద పడిపోవడం వల్ల ప్రమాదం జరిగింది. విలానోవా జట్టుతో గేమ్ ఆడేందుకు ఆటగాళ్లంతా జోయియానియాకు వెళ్తున్నారు. మృతులను లుకాస్ మెయిరా, లుకాస్ ప్రాక్సేడెస్, గుయిల్హెర్మె నో, రనులే, మార్కస్ మోలినారిగా గుర్తించారు. 
 
ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. విమానం ఎలాంటిదన్న విషయంపై జట్టు యాజమాన్యం సమాచారం ఇవ్వలేదు. పుట్ బాల్ ఆటగాళ్లంతా విమాన ప్రమాదంలో చనిపోవడంతో పామాస్ ఫుట్ బాల్ క్లబ్ లో విషాదం నెలకొంది. ఈ విమాన ప్రమాదంపై స్థానిక అధికారులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

తర్వాతి కథనం
Show comments