Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద ... విశ్వనాథ్ ఆనంద తర్వాత...

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2023 (11:13 IST)
తమిళనాడు రాష్ట్రానికి చెందిన భారత యువ చెస్ సంచలనం ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. సోమవారం జరిగిన సమీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకు ఆటగాడు ఫాబియానో కరువానాను మట్టికరిపించిన ప్రజ్ఞానంద.. తుదిపోరులో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్లెన్‌తో తాడో పేడో తేల్చుకోనున్నాడు. 
 
అంతకుముందు సెమీస్ పోరు హోరాహోరీగా సాగింది. అగ్రశ్రేణి ఆటగాడైన అమెరికా గ్రాండ్ మాస్టర్ కరువానాకు గట్టి పోటీనిచ్చిన 18 ఏళ్ల ప్రజ్ఞానంద.. టైబ్రేక్‌లో కూడా ఏమాత్రం పట్టు సడలించకుండ పోరాటం చేశాడు. మొదట తొలి రెండు క్లాసికల్ గేమ్‌లు డ్రా కావడంతో పోరు టైబ్రేకు మళ్లిన సంగతి తెలిసిందే. సోమవారం టైబ్రేక్‌లో భాగంగా జరిగిన తొలి రెండు ర్యాపిడ్ గేమ్‌లు కూడా డ్రా అయ్యాయి. 
 
తొలి గేమ్ నల్లపావులతో ఆడిన చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద 71 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు. ఆ తర్వాత గేమ్‌లో తెల్లపావులతో ఆడి 53 ఎత్తుల్లో ప్రత్యర్థిని నిలువరించాడు. దీంతో ర్యాపిడ్ రెండో రౌండ్‌కు తెరలేచింది. తొలి గేమ్ తెల్లపావులతో ప్రజ్ఞానంద ఆధిపత్యం చలాయించాడు. కరువానా నుంచి గట్టి సవాలును దాటుకుని 63 ఎత్తుల్లో విజయం సాధించాడు. ఈ గెలుపుతో ఆధిక్యంలోకి వెళ్లిన ప్రజ్ఞానంద.. ఆ తర్వాత రసవత్తరంగా సాగిన గేమ్‌ను 82 ఎత్తుల్లో డ్రా చేసుకుని ముందంజ వేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments