Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిహార్‌లో దారుణం : 13 యేళ్ల బాలికపై 28 రోజుల పాటు అత్యాచారం

woman victim
, గురువారం, 10 ఆగస్టు 2023 (16:16 IST)
బీహార్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. 13 యేళ్ళ మైనర్ బాలికపై కొందరు కామాంధులు 28 రోజుల పాటు అత్యాచారం చేశారు. ఈ బాలికను కారులో కిడ్నాప్ చేసి ఈ దారుణానికి పాల్పడ్డారు. చివరకు ఆ బాలిక ఆరోగ్యం క్షీణించడంతో ఆమె తల్లి ఫోన్ చేసి కిడ్నాప్ విషయాన్ని నిందితులు చెప్పారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత నెల 9వ తేదీన కొందరు దుండగులు కారులో వచ్చి ఓ 13 యేళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. ఆమెను శిథిలావస్థకు చేరుకున్న ఓ భవనంలో బంధించారు. అప్పటి నుంచి దాదాపు 28 రోజుల పాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆ బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో ఈ నెల 5వ తేదీన ఆ బాలిక తల్లికి దుండగులు ఫోన్ చేసి.. కిడ్నాప్ చేసిన విషయాన్ని వెల్లడించారు. 
 
వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని, కుమార్తెను ఆస్పత్రికి తరలించింది. తన కుమార్తె ఫిర్యాదుపై జూలై 9వ తేదీనే పోలీసులకు ఫిర్యాదు చేశానని, అపుడే పోలీసులు స్పందించివుంటే తన కుమార్తెకు ఈ దుస్థితి వచ్చేది కాదని ఆమె బోరున విలపిస్తూ వాపోయింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ దారుణానికి మొత్తం ఆరుగురు కామాంధులు పాల్పడ్డారు. 
 
సిగరెట్ తెచ్చిన తంటా.. ఆగిన వందే భారత్ రైలు.. 
 
కొందరు అకతాయిలు చేసే పనులు వినేందుకు నవ్వు తెప్పించేలా ఉన్నప్పటికీ, ఆందోళనకరంగా ఉంటాయి. మరికొన్నిసార్లు పెను ముప్పుకు దారితీస్తుంటాయి. తాజాగా పొగరాయుడు చేసిన పనికి వందే భారత్ రైలు అరగంట పాటు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది బుధవారం సాయంత్రం జరిగింది. సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడిచే ఈ రైలు అరగంట నిలిపివేశారు. 
 
తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళుతున్న వందే భారత్ రైలులో నెల్లూరు జిల్లా మనుబోలు రైల్వే స్టేషన్ వద్దకు రాగానే రైలులోని ఓ బోగీ నుంచి పొగలు వచ్చాయి. దీన్ని రైల్వే సిబ్బంది గుర్తించి రైలును ఆపివేసి ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. ఆ తర్వాత పొగలు వచ్చిన బోగీలో సిబ్బంది తనికీ చేశారు. 
 
అయితే, ఆ బోగీలో కాల్చిపడేసిన సిగరెట్ ముక్క ప్లాస్టిక్ సామాగ్రికి అంటుకోవడంతో పొగ వ్యాప్తి చెందినట్టు గుర్తించారు. ఈ ఘటనకు టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి కారకుడిగా గుర్తిచి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బోగీలో చెలరేగిన మంటలను పూర్తిగా ఆర్పివేసిన తర్వాత రైలు బయలుదేరి వెళ్లింది. ఈ కారణంగా ఓ అరగంట పాటు రైలు ఆలస్యంగా బయలుదేరి వెళ్లింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈగల బెడదతో వాటర్ ట్యాంక్ ఎక్కిన గ్రామస్థులు