Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో బ్లాక్ మండే.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ట్రేడింగ్ బంద్

Webdunia
సోమవారం, 23 మార్చి 2020 (10:59 IST)
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదైంది. కరోనా వైరస్ ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్న ప్రచారంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయారు. ఫలితంగా సెన్సెక్స్ సూచీ ఏకంగా 2 వేల పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ కూడా 8100 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ పతనం కొనసాగే అవకాశం ఉండటంతో బాంబే స్టాక్ మార్కెట్‌లో ట్రెడింగ్ నిలిపివేశారు. 
 
ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టిముట్టేసింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ కరోనా వల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తింటుంద‌న్న ప్రచారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో స్టాక్ మార్కెట్లు బోరుమ‌న్నాయి. అమెరికా మార్కెట్లు కూడా డీలాప‌డ‌డంతో.. సోమవారం ఉద‌యం సెక్సెక్స్‌, నిఫ్టీలు ట్రేడింగ్‌లో ప‌త‌నం చూపించాయి.
 
సెన్సెక్స్ భారీగా ప‌త‌నం కావ‌డంతో.. సుమారు 45 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిపేశారు. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ కూడా త‌గ్గింది. యాక్సిస్ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బ‌జాజ్ ఫైనాన్స్‌, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, మారుతీ సుజుకీ ఇండియా, ఐటీసీ, హీరో మోటో కార్ప్ లాంటి సంస్థ‌లు భారీగా న‌ష్ట‌పోయాయి. సోమవారం ఉద‌యం దాదాపు 10 శాతం మేర‌కు మార్కెట్లు డౌన్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments