Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్టాక్ మార్కెట్ క్రాష్... 2700 పాయింట్ల పతనం

స్టాక్ మార్కెట్ క్రాష్... 2700 పాయింట్ల పతనం
, సోమవారం, 16 మార్చి 2020 (16:17 IST)
స్టాక్ మార్కెట్ పతనం కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. అదేసమయంలో దేశంలోనూ పలు ప్రాంతాల్లో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశాలతో పాటు ప్రజలు కూడా కరోనా భయంతో వణికిపోతున్నారు. ఈ కరోనా కేవలం ప్రజలను మాత్రమే కాదు స్టాక్ మార్కెట్లను సైతం వణికిస్తున్నాయి. 
 
ఫలితంగా సోమవారం కూడా మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. రానున్న రోజుల్లో దీని ప్రభావం ఇంకా ఎంత మేర పెరుగుతుందనే భయాందోళనతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో, ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 2,713 పాయింట్లు నష్టపోయి 31,390కి పడిపోయింది. నిఫ్టీ 756 పాయింట్లు పతనమై 9,199 పాయింట్లకు దిగజారింది. 
 
అన్నింటి కన్నా ఎక్కువగా బ్యాంకింగ్ సూచీ 8.35 శాతం నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో అన్ని కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ (18.02), టాటా స్టీల్ (10.88), యాక్సిస్ బ్యాంక్ (10.65), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (10.37), ఐసీఐసీఐ బ్యాంక్ (10.08) టాప్ లూజర్లుగా ఉన్నాయి.
 
అంతకుముందు సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ మొదలైన వెంటనే మార్కెట్లు కోలుకున్నాయని, ర్యాలీ నమోదైందని ఇన్వెస్టర్లు తొలుత భావించారు. కానీ, ఆ ఆనందం, ముచ్చటగా, మూడు రోజులు కూడా మిగల్లేదు. సోమవారం ఉదయం సెషన్ ప్రారంభం కాగానే, బెంచ్ మార్క్ సూచికలు ఘోరంగా నష్టపోయాయి. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సున్నా శాతానికి చేయడం, 150 దేశాలకు పైగా కరోనా విస్తరించడం వంటి అంశాలు భవిష్యత్ ఆర్థిక వృద్ధిని కుదేలు చేస్తాయన్న అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను హరించాయి.
 
దీంతో ఈక్విటీల కొనుగోళ్ల కన్నా, అమ్మకాలకే పెట్టుబడిదారులు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో సోమవారం 10.20 గంటల సమయంలో బొంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే, 1625 పాయింట్లు పడిపోయి 4.77 శాతం నష్టంతో 32,478 పాయింట్లకు చేరింది. మదుపరుల సంపద సుమారు రూ. 7 లక్షల కోట్లకు పైగా హారతి కర్పూరం అయింది. ఆ తర్వాత ట్రేడింగ్ ముగిసే సమయానికి కూడా స్టాక్ మార్కెట్లు ఏమాత్రం కోలుకోలేక పోయాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు బర్త్ సర్టిఫికేట్ లేదు.. నేనేం చేయాలి : కేసీఆర్ ప్రశ్న.. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం