Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనాకు ఓ పారాసిట్మల్ టాబ్లెట్ చాలు.. పానిక్ బటన్ నొక్కాల్సిన పనిలేదు.. జగన్

Advertiesment
కరోనాకు ఓ పారాసిట్మల్ టాబ్లెట్ చాలు.. పానిక్ బటన్ నొక్కాల్సిన పనిలేదు.. జగన్
, ఆదివారం, 15 మార్చి 2020 (16:42 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు వైద్య నిపుణులో మందు కనుగొనలేకపోయారు. కానీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓ మందు కనిపెట్టారు. కరోనా వైరస్‌కు ఓ పారాసిట్మల్ మాత్ర సరిపోతుందని సెలవిచ్చారు. అంతేకానీ, కరోనా వైరస్ వల్ల మనుషులు చనిపోతారనీ, ఇదొక భయానక పరిస్థితి అని పానిక్ బటన్ నొక్కాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
 
ఆయన ఆదివారం రాష్ట్ర గవర్నర్ హరిచందన్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రెస్ మీట్ నిర్వహించాల్సి రావడం దురదృష్టకరమన్నారు. వృద్ధులు, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు, ఇతర వ్యాధులు ఉన్న వారిపై కరోనా వైరస్ ప్రభావం చూపుతుందన్నారు. ఇతరత్ర ఆరోగ్య సమస్యలు లేనివారు భయపడాల్సిన అవసరం లేదన్నారు. 
 
ముఖ్యంగా, కరోనా వైరస్ పై కొన్ని విషయాలు అవగాహన చేసుకోవాలని, ఈ వైరస్ వల్ల మనుషులు చనిపోతారని, ఇదొక భయానక పరిస్థితి అని 'పానిక్ బటన్' నొక్కాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. 'కరోనా' కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కొన్ని కొన్ని జాగ్రత్తలు మనం కూడా పాటించాలని సూచించారు. 
 
రాష్ట్రంలో ఇప్పటివరకు 70 నమూనాలు పరిశీలిస్తే అందులో ఒకరికి మాత్రమే కరోనా పాజిటివ్‌గా వచ్చిందని గుర్తుచేశారు. కరోనా కేసుల్లో 13.8 శాతం మాత్రమే ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నాయని, 85 శాతం కేసులకు ఇంటి దగ్గరే చికిత్స జరుగుతోందని, 4.75 శాతం కేసులు మాత్రమే విషమంగా ఉన్నాయని తెలిపారు. 
 
ఇతర దేశాల్లో ఉన్న భారతీయులను త్వరలోనే ఆయా దేశాలు వారిని స్వదేశానికి పంపిస్తాయని, ఈ పక్రియ కొన్ని నెలలపాటు కొనసాగుతుందని, ఇది రెండు, మూడు వారాల్లో పూర్తయ్యే ప్రక్రియ కాదని అన్నారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు దాదాపు యేడాదిపాటు కొనసాగుతాయని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం నువ్వా? నేనా? అధికారం వైకాపాదా? లేక ఎస్ఈసీదా? జగన్ ప్రశ్నలు