Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాక్ మార్కెట్ కొత్త రికార్డు.. 958 పాయింట్లతో సెన్సెక్స్ అదుర్స్

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (15:46 IST)
స్టాక్ మార్కెట్ కొత్త రికార్డును నమోదు చేసుకుంది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి 958 పాయింట్లు లాభపడింది. దీంతో 59,885.36 పాయింట్ల వద్ద ట్రేడ్ కావడంతో 1.63 శాతం లాభపడింది. నిఫ్టీ 276.30 పాయింట్ల లాభంతో 17,823 పాయింట్ల వద్ద ముగిసింది. 
 
ప్రపంచవ్యాప్తంగా సానుకూల సంకేతాల మధ్య బెంచ్‌మార్క్ సూచీలు అత్యధిక స్థాయిలో క్లోజ్ అయ్యాయి. దాదాపు 1866 షేర్లు లాభపడ్డాయి. 1305 షేర్లు క్షీణించాయి. 148 షేర్లలో మార్పు లేదు. బజాజ్ ఫిన్‌సర్వ్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, లార్సెన్, టూబ్రో, కోల్ ఇండియా నిఫ్టీలో ప్రధాన లాభాలను ఆర్జించగా, నష్టపోయిన వాటిలో HDFC లైఫ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, నెస్లే ఇండియా, ITC మరియు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి.
 
బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ సూచీలు 1 శాతం పెరిగినందున విస్తృత మార్కెట్ బెంచ్‌మార్క్‌లను అధిగమించింది. సెక్టోరల్ ఫ్రంట్‌లో, రియల్టీ ఇండెక్స్ దాదాపు 9 శాతం లాభపడింది, ఐటీ, మెటల్, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు 1 శాతం పెరిగాయి.
 
అంతకుముందు మధ్యాహ్నం సెన్సెక్స్ 800 పాయింట్లు లాభపడడంతో బీఎస్ఈ లిస్ట్ అయిన కంపెనీల విలువ ఏకంగా రూ. 3 లక్షల కోట్లు పెరిగింది. ఇందుకు కారణం…కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, ఆర్థిక వ్యవస్థ మెల్లిగా పుంజుకోవడంతో ఈ పరిణామాలు స్టాక్ మార్కెట్‌లపై సానుకూల ప్రభావం చూపాయని అంటున్నారు విశ్లేషకులు. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లలో మార్పు చేయరనే సంకేతాలు రావడం..మార్కెట్ లు ఫుల్ జోష్‌లో ట్రేడ్ అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరోయిన్ నా కుమార్తెలాంటిది : నిర్మాత అల్లు అరవింద్

ఫిబ్రవరి 7న "తండేల్" రిలీజ్.. సంక్రాంతితో పోటీ వద్దు.. వాలెంటైన్స్ డేనే ముద్దు

జ్యోతిక లేకుండా వుండలేను.. కార్తీ నువ్వు కార్తీ కాదు.. కత్తివిరా!: సూర్య (video)

తెలుగోళ్లు అన్నం పెడుతున్నారు.. తప్పుగా మాట్లాడలేదు : నటి కస్తూరి

పిల్లల సమక్షంలో రెండో పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్.. వరుడు ఎవరంటే? (photos)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments