Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ పతం.. పెరిగిన బంగారం ధర

Advertiesment
BSE Stock Market
బాంబే స్టాక్ మార్కెట్‌లో స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఊగిసలాట ధోరణిని ప్రదర్శించాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. 
 
ఫలితంగా బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 282 పాయింట్లు కోల్పోయి 52,306కి పడిపోయింది. నిప్టీ 85 పాయింట్లు నష్టపోయి 15,686కి దిగజారింది.
 
ఈ ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌ కంపెనీలను పరిశీలిస్తే, మారుతి సుజుకి (2.33%), టైటాన్ కంపెనీ (1.49%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.22%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.84%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.69%) చొప్పున లాభపడ్డాయి. 
 
అలాగే, టాప్ లూజర్స్‌ను పరిశీలిస్తే, కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.32%), ఎల్ అండ్ టీ (-1.29%), టాటా స్టీల్ (-1.23%), టీసీఎస్ (-1.17%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.96%) చొప్పున నష్టపోయాయి. 
 
ఇదిలావుంటే, దేశ రాజ‌ధాని ఢిల్లీలో బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. ఇవాళ ఢిల్లీ మార్కెట్‌లో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.110 పెరిగి రూ.46,396కు పెరిగింది. 
 
క్రితం ట్రేడ్‌లో తులం స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.46,286 వ‌ద్ద ముగిసింది. అంత‌ర్జాతీయంగా విలువైన లోహాల ధ‌ర స్వ‌ల్పంగా పెరుగ‌డ‌మే ఇవాళ బంగారం ధ‌ర స్వ‌ల్పంగా పెరుగ‌డానికి కార‌ణ‌మ‌ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
 
అదేవిధంగా ఇవాళ కిలో వెండి ధ‌ర రూ.324 పెరిగి రూ.66,864కు చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధ‌ర రూ.66,540 వ‌ద్ద ముగిసింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర 1,783 అమెరిక‌న్ డాల‌ర్‌లు, ఔన్స్ వెండి ధ‌ర 25.94 అమెరిక‌న్ డాల‌ర్‌లు ప‌లికింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త వద్ద వధువు వింత కోరిక.. శోభనాన్ని షూట్ చేయాలి.. ఫోటోగ్రాఫర్స్‌ను కూడా..?