Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటివారు ఎంత చేసినా ప్రేమలో పడరు... ఇలాంటివారైతే...

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (18:05 IST)
ప్రేమ అంటే ఏమిటి? అది ఎప్పుడు మొద‌ల‌వుతుంది? పిల్ల‌ల‌పై త‌ల్లిదండ్రుల ప్రేమ‌, స్నేహితుల మ‌ధ్య ప్రేమ‌, దేశంపై ప్రేమ‌... ఈ ప్రేమ‌ల కంటే భిన్న‌మైంది...ల‌వ‌ర్స్ మ‌ధ్య ప్రేమ‌. ఇది మాత్రం స‌గ‌టున రెండేళ్ళు ఉంటుంద‌ని మాన‌సిక శాస్త్ర‌వేత్త‌లు చెపుతున్నారు. బాల్యంలో తల్లితండ్రులు, పెద్ద‌ల‌తో క‌లసిమెలిసి ఉండే తీరు పిల్ల‌ల్లో ఆడ‌మ‌గ‌ల‌కు సంబంధించిన భావ‌న‌ల్నిక‌లిగిస్తుంది. పెరిగేట‌పుడు చుట్టుప‌క్క‌ల వాళ్ల‌తో, అదే వ‌య‌సు వారితో వ్య‌వ‌హరించే తీరు... పార్ట‌న‌ర్ ఎలా ఉండాల‌ని కోరుకుంటారో నిర్ణ‌యిస్తుంది.
 
పుస్త‌కాలు, టీవీలు, సినిమాలు మొద‌లైన సాధ‌నాలు కూడా మ‌న ఇష్టాయిష్టాల‌పై ప్ర‌భావం చూపుతాయి. యుక్త వ‌య‌సు వ‌చ్చాక ఆక‌ర్ష‌ణ‌ల‌కు సంబంధించిన భావాల‌ను గుర్తించ‌గ‌లుతాయి. ఎలాంటి సంద‌ర్భాలు మ‌నుషుల్లో కామోధ్రేకాన్ని క‌లిగిస్తాయి? ఎలాంటివి క‌లిగించ‌వు అనేది గుర్తిస్తారు. ఈవిధంగా నేర్చుకున్న అనుభ‌వాల వ‌ల్ల ఎలాంటి వారితో ఆక‌ర్షితులౌతారో గుర్తించ‌గ‌లిగి వాటితో కొన్ని సంద‌ర్భాల‌లో ప్రేమ‌లో ప‌డ‌తారు. 
 
అంత‌రంగంలో ఏర్ప‌డే ఇష్టాలు, ప్ర‌వ‌ర్త‌నే ల‌వ్...
అంత‌రంగంలో ఏర్ప‌డే ప్ర‌త్యేక‌మైన ఇష్టాలు, ప్ర‌వ‌ర్త‌న‌ల‌ను ల‌వ్ మ్యాప్ అంటార‌ని సైకాల‌జిస్ట్ డాక్ట‌ర్ జానీమ‌న్ నిర్వచించారు. ఈ ల‌వ్ మ్యాప్ బాల్యంలోనే మొద‌ల‌వుతుంద‌ట‌. అనుభవాలు వ‌చ్చేకొద్దీ స్థిర‌మై, కామోద్రేకం క‌ల్పించ‌డానికి ఏది అవ‌స‌ర‌మో దాన్ని నిర్ణ‌యిస్తుంది. ఒకే ర‌క‌మైన ప‌రిస‌రాల‌లో పెరిగిన వారిలో... ల‌వ్ మ్యాప్ దాదాపు ఒకే ర‌కంగా ఉంటుంద‌ట‌.
 
ఉదాహ‌ర‌ణ‌కి చాలామంది మ‌గ‌వారు సాధారణ ప‌రిధిలో ఉండే ఆడ‌వాళ్ళ‌ను చూస్తే ఆక‌ర్షితుల‌వుతారు. కళ్ళు, జుట్టు, శ‌రీర వ‌ర్ణం, శ‌రరీరాకృతి, వ్య‌క్తిత్వం వీటిలో ఒక్కొక్క‌ళ్ళ‌కు ఒక్కొక్క‌టే ఎక్కువ‌గా న‌చ్చ‌వ‌చ్చు. కానీ కొంద‌రిలో ఆ కామోద్రేకం ప్ర‌త్యేక‌మైన, అరుదైన వాటివ‌ల్లే క‌లుగుతుంది. హ‌ద్దులు లేకుండా, త‌క్కువ కాల‌మే ఉన్నా ఆనందాన్ని ఇస్తాయి. కానీ, ప‌ర‌స్ప‌ర అనురాగం, న‌మ్మ‌కం, ప్రేమ‌లేని సంబంధాల‌ వ‌ల్ల‌ శృంగార సంబంధాలు కూడా దెబ్బ‌తింటాయి. 
 
జీవితంలో ఏదో సాధించాల‌నుకునేవారు ప్రేమలో ప‌డ‌రు!
కొంద‌రికి జీవితంలో కొన్ని సాధించే త‌ప‌న వ‌ల్ల ప్రేమ‌లో ప‌డ‌రు. వాళ్ళు కూడా తృప్తిగా ఆనందంగా జీవిస్తారు. అలాంటి వారికి సెక్స్ కూడా పెద్ద ముఖ్య‌మైన‌ది కాదు. ప్రేమ కొంద‌రిలో శ‌రీరంలోని తీవ్ర‌మైన ర‌సాయినిక మార్పుల వ‌ల్ల క‌లుగుతంది. బాధ లాంటిది క‌లిగిన‌పుడు శ‌రీరంలో ర‌సాయ‌నిక మార్పు జ‌రుగుతుంది. ప్రేమ‌లో క‌లిగే థ్రిల్లింగ్ ఫీలింగ్స్, ఉత్సాహానికి మెద‌డులోని ఫినైల్ ఇథూల‌మిన్ అనే ర‌సాయ‌న ప‌దార్థం డ్ర‌గ్స్ లాంటి ప్ర‌భావాన్ని క‌లిగిస్తుంది. కాక‌పోతే మెద‌డులో ఇది స‌హ‌జంగా విడుద‌లయ్యేది. చాక్లెట్లలో కూడా ఫినైల్ ఇథైల‌మిన్ ఎక్కువ‌గా ఉంటుంది. దీనివ‌ల్ల ప్రేమికుల‌ అనుబంధం మ‌రంత పెరిగి క‌లిసి ఉందామ‌నుకునే దాకా వ‌చ్చిపుడు మ‌త్తు ప‌దార్థాల్లాంటివి మెద‌డులో విడుద‌లవుతాయి. అందుకే మ‌నిషి ఆందోళ‌న లేకుండా ఆనందంగా ఉంటాడు. 
 
ప్రేమలో ప‌డితే ల‌క్ష‌ణాలు...
ప్రేమిస్తున్న వారిని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండ‌టం.
వారిచేత కూడా ప్రేమించ‌బ‌డాల‌ని ఎప్పుడూ కోరుకుంటూ ఉండ‌టం. 
ప్రియస‌ఖి చేష్ట‌ల‌ను బ‌ట్టి వీరి మూడ్ ఉండ‌టం.
ప్రేమించేవారి త‌ప్పుల‌ను కూడా గుడ్డిగా విశ్వసించ‌డం. (ప్రేమ గుడ్డిది అంటారందుకే)
ప్ర‌మ‌లో ప‌డ్డాక కొంద‌రు చ‌దువులో మార్కులు గ్రేడుల్లో వెన‌క‌బ‌డితే, మ‌రికొంద‌రు ప్రేమించడం మొద‌లుపెట్టాక ఆనందంగా ఉండి మార్కులు పెరిగేలా చ‌ద‌ువ‌గ‌ల‌రు. ప్రేమ‌లో ప‌డిన‌వారి ప్ర‌వ‌ర్తన అర్థం చేసుకోవ‌డం మిత్రుల‌కు, కుటుంబ స‌భ్యుల‌కు క‌ష్ట‌మ‌వుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీతేజ్: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ ఈ అబ్బాయి ఇప్పుడెలా ఉన్నాడు?

పుష్ప 2 బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రష్మిక మందన్న

Mariyamma Murder Case: నందిగాం సురేష్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీం

ఢిల్లీలోని భవనంపై టెర్రస్ నుంచి నవజాత శిశువు మృతదేహం.. ఎలా వచ్చింది?

మాదాపూర్ బార్ అండ్ రెస్టారెంట్‌‌లో అగ్నిప్రమాదం... (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa-2- పుష్ప-2: 100 సంవత్సరాల హిందీ సినిమా చరిత్రలో కొత్త మైలురాయి

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల

తెలంగాణలో సినిమా అభివృద్ధి కాకపోవడానికి కారకులు ఎవరు?

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

తర్వాతి కథనం