Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాడు కాదంటే నేను ఆమెకు దగ్గరయ్యా.... ఇప్పుడు మళ్లీ కావాలంటున్నాడు... ఎలా?

Advertiesment
Life style
, మంగళవారం, 13 నవంబరు 2018 (12:02 IST)
మాది సంపన్నుల కుటుంబం. ఆరు నెలల క్రితం మా పెదనాన్న కొడుకు ఓ సంబంధాన్ని చూద్దామని నన్ను కూడా తీసుకెళ్లాడు. కానీ ఎందుకో ఆ అమ్మాయిని చేసుకోనని చెప్పేశాడు. కానీ ఆమె నాకు బాగా నచ్చింది. కాకపోతే నాకంటే రెండేళ్లు పెద్దది. ఐనప్పటికీ ఆమె నాకు నచ్చడంతో ఫోన్ నెంబరు తీసుకున్నాను. ఆ తర్వాత ఆమెతో ఫోను సంభాషణ చేస్తూ స్నేహాన్ని పెంచుకున్నాను. ఆమె కూడా నేనంటే ఎంతో ఇష్టంగా ఉండేది. ఒక్కరోజు ఫోన్ చేయకపోయినా విపరీతంగా బాధపడేది. అలా మామధ్య సాన్నిహిత్యం పెరిగింది. 
 
శృంగారంలో కూడా పాల్గొన్నాం. ఇక ఇద్దరం పెళ్లి చేసుకుందామని అనుకుంటుండగా హఠాత్తుగా నా పెదనాన్న కుమారుడు ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని మొదటికొచ్చాడు. మా ఇద్దరి వ్యవహారం తెలియని పెద్దలు కూడా వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ విషయంపై ఆమెను అడిగితే తను నిస్సహాయరాలినని అంటోంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియడంలేదు. ఈ స్థితిలో నాకు దారేమిటో తోచడంలేదు...?
 
మీ ఇద్దరూ పరస్పర ఆకర్షణకు లోనై దగ్గరయ్యారు. పెళ్లికి ముందు ఇలా శృంగారపరంగా దగ్గరవ్వడం అనర్థాలకు దారితీస్తుందని తెలిసినా చాలామంది ఇలాంటి తప్పులే చేస్తుంటారు. ఈ సమస్యకు పరిష్కార మార్గం, జరిగిన విషయాన్ని మీ పెదనాన్న కుమారుడికి చెప్పేసి, ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవడం ఒక్కటే. రెండుమూడేళ్లు వయసు తేడా ఉన్నా... అదేమీ పట్టింపు కాదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దంతాలపై పచ్చని గార పోవట్లేదా... అయితే ఇలా చేయండి...