ప్రకృతి ప్రసాదించిన పండ్లలో పనస పండు ఒకటి. ఇది సీజనల్ ఫ్రూట్. ఇది చూసేందుకు పెద్దగా ఉండి కొయ్యడానికి కూడా కష్టంగా ఉంటుంది. కానీ మార్కెట్లో పనసతొనలను విక్రయిస్తుంటారు. మంచి వాసన వస్తూ నోరూరిస్తుంటాయి. యేడాదిలో ఒక్కసారి తప్పనిసరిగా ఆరగించాల్సిన పండు. ఈ పండుతో అనేక బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
* పనస పండులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఎముకలను మరింత దృఢంగా ఉంచుతుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను సక్రమంగా ఉండేలా చేస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను నివారిస్తుంది.
* పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను విపరీతంగా పెంచుతుంది. తద్వారా లైంగిక కోర్కెలు పెరిగి.. పడక గదిలో శృంగార ఆనందాన్ని రెట్టింపు పొందేలా చేస్తుంది.
* ఇందులో విటమిన్ ఎ, సి, బి6తో పాటు థియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉన్నాయి.
* ఈ పండులో ఉండే ఫైటో న్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ కేన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ప్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి.
* పనసతొనల్లో ఉండే సోడియ అధిక రక్తపోటు బారినుంచి కాపాడుతుంది. గుండె సమస్యలను తగ్గిస్తుంది. ఆస్తమా, శ్వాస కోస వ్యాధుల నుంచి కాపాడుతుంది.
* డయాబెటిస్ ఉన్నవారికి కూడా బాగా పని చేస్తుంది. శరీరంలోని గ్లూకోజ్ లెవల్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది.
* ఈ పండులో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
* చర్మంపై ఉండే మృత కణాలను తొలగించి చర్మ కాంతిని పెంపొందిస్తుంది.