Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉల్లిపాయతో ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. ఇంకా...

Advertiesment
ఉల్లిపాయతో ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. ఇంకా...
, బుధవారం, 31 అక్టోబరు 2018 (12:24 IST)
'తల్లి చేయలేని మేలు ఉల్లి చేస్తోంది' అని అంటారు మన పెద్దలు. ఈ మాట ఊరికే అనలేదు. ఉల్లి వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి. శరీర ఆరోగ్య శుద్ధీకరణలో ఉల్లిపాయ ఎంతో సహాయ పడుతుంది. అలాగే, ఉల్లిగడ్డ ఆస్తమా రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు జీర్ణవ్యవస్థ మెరుగుపరుస్తుంది. ఇలా ఆరోగ్య ప్రయోజనాలే కాదు ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని ఓసారి పరిశీలిద్దాం. 
 
* ఉల్లిపాయ కేవలం కూరల్లో రుచికి మాత్రమే కాదు. పలు రకాలుగా ఉపయోగపడుతుంది. 
* తలుపులు, కిటికీ గ్రిల్స్ చాలా మురికి పడుతుంటాయి. అలాంటప్పుడు ఉల్లిగడ్డ ముక్కతో గ్రిల్స్ మీద రుద్దాలి. దాంతో పేరుకుపోయిన దుమ్ము, ధూళి ఉల్లిముక్కకు అంటుకొని గ్రిల్స్ శుభ్రపడుతాయి.
* వంటగదిలో స్టౌ ఉండే ప్రదేశంలో పాలు, నూనె వంటి మరకలు పోగొట్టడం చాలా కష్టం. అలాంటప్పుడు మరకల మీద ఉల్లిముక్కలతో రుద్ది, తర్వాత డిజర్జెంట్‌తో కడిగితే మరకలు తొలిగిపోతాయి.
 
* చిన్న రంధ్రాలున్న ఎక్సాస్ట్ ఫ్యాన్‌ని శుభ్రం చేయాలంటే అంత తేలికైన పని కాదు. ఉల్లిగడ్డ ముక్కలను బేకింగ్ సోడాలో ముంచి ఫ్యాన్‌ని రుద్దాలి. ఘాటైన ఉల్లిరసానికి మురికి సులువుగా పోతుంది.
* దోమలు లోపలికి రాకుండా కిటికీకి మెష్ వాడుతుంటారు. కానీ మెష్‌లో ఇరుక్కుపోయిన దుమ్మును పోగొట్టడం సులువైన పని కాదు. ఉల్లిగడ్డ ముక్కలతో రుద్దితే మెష్ శుభ్రంగా ఉండటమే కాకుండా క్రిమీకీటకాలు లోనికి రాకుండా ఉంటాయి. ఇలా ఇంటిని పరిశుభ్రంగా ఉంచడానికి కూడా ఉల్లి ఎంతగానో ఉపయోపడుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పనస తొనలను తేనెలో రంగరించి తింటే..?