ఒక్కసారి చుంబించి పత్తాలేడు... ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయాడు... ఎందుకని?

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (16:51 IST)
ఇటీవలే కొత్తగా ఐటీ ఉద్యోగంలో చేరాను. ఓ యువకుడు నేనంటే పడి చస్తుండేవాడు. చాలా కాలం అతడికి నేను రెస్పాండ్ అవలేదు. కానీ అతడు నాకోసం అలా ఎదురుచూస్తుండటంతో నేను నవ్వాను. అంతే... మెల్లిగా అతడు కూడా నన్ను పలుకరించసాగాడు. అలా మా పరిచయం చాలా క్లోజ్‌గా మారిపోయింది. 
 
ఓ రోజు అనుకోకుండా నా చేయి అతడికి తగిలింది. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడు నా చేయిని పట్టుకున్నాడు. ఏమయిందో తెలియదు కానీ... ఇద్దరం కొద్దిసేపు గాఢ చుంబనాల్లో తేలిపోయాము. ఆ రోజు నేనతడ్ని విడిచిపెట్టలేకపోయాను. అతడు వెళ్లిపోయాడు. కానీ తిరిగి రాలేదు. ఆఫీసుకు కూడా రావడం లేదు. ఏంటని ఆరా తీస్తే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయాడట. అతడు ఎందుకిలా చేశాడో అర్థం కావడంలేదు.
 
పరస్పరం ఇద్దరూ ఆకర్షణకు లోనై ముద్దుల వరకూ వెళ్లి గాఢ చుంబనాల్లో తేలిపోయారు. ఐతే ఇది జరిగాక అతడు పత్తా లేకుండా పారిపోయాడంటే అతడు ఏదో చిక్కుల్లో ఇరుక్కుని వుంటాడు లేదంటే మీరు పెళ్లి ప్రపోజ్ చేస్తారనే భయంతో వెళ్లిపోయి వుండవచ్చు. ఏదేమైనప్పటికీ మీకు ఎలాంటి క్లూ ఇవ్వకుండా ఏకంగా ఉద్యోగానికే రాజీనామా చేసి వెళ్లిపోయాడంటే... అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడో?

ఏదేమైనప్పటికీ అంతగా ప్రేమించినవాడయితే విషయాన్ని ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఈరోజుల్లో ఎంతటి విషయాన్నయినా జస్ట్ ఓ ఫోన్ కాల్ లేదా మెసేజ్ ద్వారా తెలియజేయవచ్చు. ఇలా చెప్పకుండా పారిపోయినతడి గురించి తలుచుకుని మనసు పాడుచేసుకునే కంటే అతడిని మర్చిపోవడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.20 కోట్ల ఆస్తి కోసం భర్తను కిడ్నాప్ చేసింది.. కానీ పోలీసులకు చిక్కింది.. ఎలా?

టెలివిజన్ నటి లైంగిక వేధింపులు.. ఫ్రెండ్ రిక్వెస్ట్ కొంపముంచింది..

తనను ప్రేమించను అన్నందుకు బాలికను తుపాకీతో కాల్చిన దుండగుడు (video)

Chevireddy: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టు చేసిన పోలీసులు - 12మంది అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

తర్వాతి కథనం
Show comments