Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిపబ్లిక్ వేడుకలు : రాజ్యాంగం గురించి తెలియని కొన్ని విషయాలు

ఈనెల 26వ తేదీన భారత గణతంత్ర వేడుకలు జరుపుకోనున్నాం. ఇందుకోసం యావత్ దేశం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా రాజ్యాంగం గురించి తెలియని కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్ధాం.

Webdunia
సోమవారం, 22 జనవరి 2018 (14:17 IST)
ఈనెల 26వ తేదీన భారత గణతంత్ర వేడుకలు జరుపుకోనున్నాం. ఇందుకోసం యావత్ దేశం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా రాజ్యాంగం గురించి తెలియని కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్ధాం. 
 
"రాజ్యాంగం మంచిదే కానీ, మంచి వారి చేతుల్లో ఉంటేనే మంచిది, చెడ్డవారి చేతుల్లో పడితే చెడ్డదే అవుతుంది" అని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నారు.
 
"ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం" అని అబ్రహం లింకన్ అన్నారు.
 
ప్రజాస్వామ్యానికి మూల గ్రంథంలాంటిది మన రాజ్యాంగం. మరి మన రాజ్యాంగం గురించీ, గణతంత్రం గురించి కొన్ని విషయాలు….
 
రాజ్యాంగం రాత ప్రతిని తయారు చేసేందుకు 1947 ఆగష్టు 29వ తేదీన రాజ్యాంగ సభ ఒక డ్రాఫ్టు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి డాక్టర్ బీఆర్. అంబేద్కర్ అధ్యక్షుడు. 
 
"భారత ప్రజలమైన మేము, భారత్‌ను సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని, దేశ పౌరులందరికీ కింది అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించాము, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ, హోదాలోను, అవకాశాలలోను సమానత్వం, వ్యక్తి గౌరవాన్ని, దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడి సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పుతామని కూడా దీక్షాబద్ధులమై ఉన్నాము. 1949 నవంబర్ 26వ తేదీన మా రాజ్యాంగ సభలో ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి, ఆమోదించి, మాకు మేము సమర్పించుకుంటున్నాము….." అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. 
 
1949 నవంబరు 26వ తేదీన రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించి శాసనంగా రూపొందించుకున్నప్పటికీ, 1950 జనవరి 26 నుంచి 395 అధికరణలు, 22 భాగాలు, 9 షెడ్యూళ్ళతో అమల్లోకి వచ్చింది. ఆ రోజున ప్రపంచానికి భారత దేశం నూతన గణతంత్ర రాజ్యం(రిపబ్లిక్‌)గా ప్రకటించబడింది. ప్రస్తుతం 447 ఆర్టికల్స్‌, 26 అధ్యాయాలు, 12 షెడ్యూళ్ళు, 121 సవరణలతో కూడినది ఈ భారత దేశ బృహత్‌ రాజ్యాంగం..
 
స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు పట్టిన కాలం: 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు.
రాజ్యాంగ సభ 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాయటానికే పట్టింది.
రాజ్యాంగ రాతప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది. 
 
భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేసారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఫలితంగా భారత్ సంపూర్ణ గణతంత్ర దేశంగా అవతరించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments