Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇక ఎగిరే విమానంలో వాట్సాప్, ఫేస్‌బుక్ చూసుకోవచ్చు

విమాన ప్రయాణీకులకు ఓ శుభవార్త. విమానంపైకి ఎగిరే సమయంలో ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయాల్సి వుంటుంది. అయితే ఇక సీన్ మారనుంది. ఇకపై విమానంలో ప్రయాణిస్తూ కూడా మొబైల్ ద్వారా కాల్స్ చేసుకునేందుకు, వాట్సాప్, ఫేస్ బు

Advertiesment
TRAI
, శనివారం, 20 జనవరి 2018 (13:15 IST)
విమాన ప్రయాణీకులకు ఓ శుభవార్త. విమానం పైకి ఎగిరే సమయంలో ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయాల్సి వుంటుంది. అయితే ఇక సీన్ మారనుంది. ఇకపై విమానంలో ప్రయాణిస్తూ కూడా మొబైల్ ద్వారా కాల్స్ చేసుకునేందుకు, వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా చాటింగ్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. దేశీయ పరిధిలోని విమానాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను అనుమతించాలని ట్రాయ్ సిఫార్సు చేసింది. 
 
3000 మీటర్ల ఎత్తులో మొబైల్ ఫోన్స్ వాడకాన్ని అనుమతించాలని ట్రాయ్ సిఫార్సు చేసింది. విమానాల్లో మొబైల్‌ను ఎయిర్ ప్లేన్ మోడ్‌లో ఉంచాలని ఆదేశించినపుడు వైఫై ద్వారా ఇంటర్నెట్ సేవలు అనుమతించవచ్చని, విమానాల్లో సేవలకు వార్షిక లైసెన్స్ రుసుముగా ప్రారంభంలో రూపాయి మాత్రమే ఉండాలని ట్రాయ్ నిర్దేశించింది. 
 
సాంకేతికంగా సాధ్యమైనప్పుడు, భద్రతాపరమైన ఆందోళనలు లేనప్పుడు మొబైల్ సేవలపై నియంత్రణ అవసరం లేదని ట్రాయ్ పేర్కొంది. అయితే దేశీయ గగనతలంపై మొబైల్ కమ్యూనికేషన్ ఆన్ ఎయిర్‌క్రాఫ్ట్, ఇన్-ఫ్లయిట్ కనెక్టివిటీని వాడుకోవచ్చని, ఈ సేవలను అందించడం విమానయాన సంస్థల ఇష్టమని ట్రాయ్ అధికారులు తెలిపారు. మొబైల్ ఫోన్లతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఉపయోగించుకోవచ్చునని ట్రాయ్ అధికారులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తకు చర్మవ్యాధి.. తాగొచ్చి లైంగిక వేధింపులు.. కత్తిపీటతో నరికి?