అన్నం కంటే బురద మట్టే ముద్దంటున్న శతాధిక వృద్ధుడు (వీడియో)
అన్నం కంటే బురద మట్టే ముద్దు అని అంటున్నాడో శతాధిక వృద్ధుడు. అతని పేరు కరు పాశ్వాన్. ఊరు జార్ఖండ్ రాష్ట్రం. ఈయన రోజువారీ ఆహారంగా బురదమట్టిని తీసుకుంటాడు. ఈ అలవాటు 11 యేళ్ళ ప్రాయం నుంచి అలవాటు అయిందట.
అన్నం కంటే బురద మట్టే ముద్దు అని అంటున్నాడో శతాధిక వృద్ధుడు. అతని పేరు కరు పాశ్వాన్. ఊరు జార్ఖండ్ రాష్ట్రం. ఈయన రోజువారీ ఆహారంగా బురదమట్టిని తీసుకుంటాడు. ఈ అలవాటు 11 యేళ్ళ ప్రాయం నుంచి అలవాటు అయిందట. అప్పటి నుంచి ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. దీంతో మట్టినే ఆహారంగా తీసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నాడు.
నిరుపేద కుటుంబంలో పుట్టిన కారణంగా తినడానికి తిండి లేకపోవడంతో 11 ఏళ్ల వయసులో పాశ్వాన్ బురద మట్టిని తినడం అలవాటు చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు బురద మట్టే ఆయనకు రోజువారీ ఆహారంగా మారిపోయింది. ప్రస్తుతం వందేళ్లకు పైబడి ఉన్న పాశ్వాన్... మట్టిలోని పోషకాలే తన ఆరోగ్య రహస్యమని చెబుతుంటాడు. ఆయనకు సంబంధించిన వీడియోను మీరూ చూడండి.