Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం క్యూఆర్ కోడ్‌

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (21:23 IST)
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేకంగా ఓ క్యూఆర్ కోడ్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా శ్రీవారి భక్తుల అరచేతిలో తిరుమల రూట్ మ్యాప్ ప్రత్యక్షం కానుంది. 
 
ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా తిరుమలలో కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. వెళ్లాల్సిన చోటుపై క్లిక్ చేస్తే రూట్ మ్యాప్ వస్తుందని, దాన్ని అనుసరించి వెళితే గమ్యస్థానం చేరుకోవచ్చని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. 
 
టీటీడీ వసతి సముదాయాలు, గెస్ట్ హౌసులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, లడ్డూ కౌంటర్లు, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాల వివరాలన్నీ మొబైల్ ఫోన్‌లో కనిపిస్తాయి. తద్వారా కొండపై ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లేందుకు సులువు అవుతుందని టీటీడీ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

అన్నీ చూడండి

లేటెస్ట్

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

01-05-2025 గురువారం దినఫలితాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...

అక్షయ తృతీయ 2025: శ్రీలక్ష్మీ మంత్ర పఠనతో అంతా సుఖమే

30-04-2015 మంగళవారం ఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Laughing Buddha: లాఫింగ్ బుద్ధుడి బొమ్మను ఇంట్లో ఏ దిశలో వుంచాలి?

తర్వాతి కథనం
Show comments