Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తులు అమ్మడం కొత్తేమీ కాదు : తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

Webdunia
సోమవారం, 25 మే 2020 (19:58 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డుకు నిరర్ధక ఆస్తులను విక్రయించడం కొత్తేమీ కాదనీ తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. తితిదే భూముల వేలానికి సంబంధించి సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ అవుతుండటం, గవర్నర్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ, టీటీడీ భూముల వేలంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఎలాంటి కూడా ఆదేశాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. గత బోర్డు నిర్ణయాలపై మాత్రమే సమీక్షించామన్నారు. 
 
బోర్డు ఆస్తులు అమ్మడం ఇదేమీ కొత్త కాదని, 1974 నుంచి భూములను అమ్మినట్లు చెప్పారు. ఆస్తుల విక్రయానికి సంబంధించి వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకొంటామన్నారు. అదేసమయంలో అన్యాక్రాంతం కాకుండా ఆస్తుల్ని అమ్మడం టీటీడీకి కొత్తకాదని అన్నారు. 
 
టీటీడీ భూములను వేలం వేయాలని గత బోర్డు సభ్యులే నిర్ణయించారన్నారు. 2016 జనవరి 30వ తేదీనే 50 ఆస్తుల వేలంపై టీడీపీ సబ్‌ కమిటీ నిర్ణయం తీసుకొన్నదని చెప్పారు. భూముల వేలంపై రెండు బృందాలను ఏర్పాటుచేశామని, భూముల పరిరక్షణకు మాత్రమే మేం నిర్ణయాలు తీసుకొంటున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments