Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి భూములను అమ్మేస్తే ప్రమాదం : పవన్ కళ్యాణ్

Advertiesment
శ్రీవారి భూములను అమ్మేస్తే ప్రమాదం : పవన్ కళ్యాణ్
, సోమవారం, 25 మే 2020 (13:35 IST)
ప్రపంచంలోనే అతి పెద్ద అత్యధిక ఆదాయం వచ్చే సంస్థల్లో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే). అలాంటి  తితిదేకు చెందిన భూములను విక్రయిస్తే ఎలా? అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.పైగా, దేశంలోని అన్ని హిందూ దేవాలయాలు, సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తాయని, టీటీడీ మంచి పద్ధతులను అనుసరించి ఇతరులకు స్ఫూర్తిగా నిలవాల్సి ఉంటుందని గుర్తుచేశారు. 
 
తమిళనాడులో ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించాలని తితిదే నిర్ణయం తీసుకుంది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా, విపక్ష పార్టీ ఈ అంశంపై ఒక్కతాటిపైకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సైతం తన అభిప్రాయాన్ని ట్వీట్ల రూపంలో వెల్లడించారు. 
 
ఒకవేళ తితిదే భూములను అమ్మేస్తే, ఇతర దేవస్థానాలు కూడా ఈ పద్ధతులను పాటించే అవకాశముందని హెచ్చరించారు. ఇలాంటి చర్యల వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
 
ముఖ్యంగా, విభజనతో నష్టపోయి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఇప్పటికీ పూర్తి స్థాయి రాజధాని నగరం లేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
రాష్ట్రానికి పెట్టుబడులు కావాలని, ఉద్యోగాలను సృష్టించాలని, ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకోవాలన్నారు. ఇటువంటి సమయంలో భూములు రెవెన్యూ కోసం ఉపయోగపడతాయని, ప్రభుత్వ భూములను, ఆస్తులను సర్కారు తప్పనిసరిగా కాపాడుకోవాలని ఆయన అన్నారు.
 
ఇందుకోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలని చెప్పారు. భక్తుల నమ్మకాలు, మనోభావాలు దెబ్బతీయడం, రాష్ట్రంలో భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితులను బాగుచేసే అంశాలను కూడా ప్రమాదంలోకి నెట్టితే ఇది వైసీపీ ప్రభుత్వం చేసిన ఘోరమైన తప్పుగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. 


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా ఎఫెక్ట్: కోట్ల మంది మహిళలకు గర్భనిరోధక సాధనాల కొరత, పెరిగిపోతున్న అవాంఛిత గర్భాలు