Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి భక్తులకు ఇక పండుగే, లడ్డూలే లడ్డూలు.. ఎక్కడ దొరుకుతాయంటే?

శ్రీవారి భక్తులకు ఇక పండుగే, లడ్డూలే లడ్డూలు.. ఎక్కడ దొరుకుతాయంటే?
, శనివారం, 23 మే 2020 (17:38 IST)
శ్రీవారి ప్రసాదమంటే భక్తులకు ఎంతో ప్రీతి. ఆ స్వామివారిని దర్సనం చేసుకున్న తరువాత లడ్డూలు కొనుక్కుని వెళ్ళడం ఆనవాయితీ. తిరుపతి వెళ్ళొచ్చామంటే ఎవరైనా అడిగేది ఆ స్వామివారి ప్రసాదమే. అలాంటి ప్రసాదం.. స్వామివారి దర్సనం గత రెండు నెలలుగా దూరమైంది భక్తులకు. అయితే లడ్డూలను భక్తులను పంపిణీ చేసేందుకు టిటిడి సిద్థమైంది.
 
ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లో లడ్డూలను టిటిడి కళ్యాణ మండపాల్లో భక్తులకు అందుబాటులో ఉంచుతామని టిటిడి ప్రకటించింది. ప్రకటించిన విధంగానే తిరుమల నుంచి లారీలలో లడ్డూలు బయలుదేరాయి. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు లడ్డూ ప్రసాదాలను తీసుకువెళ్ళే లారీలను శనివారం ఉదయం ఆయన ప్రారంభించారు.
 
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భక్తులకు తిరుమల శ్రీవారి దర్సనాన్ని దాదాపు 60 రోజులగా నిలిపివేసినట్లు తెలిపారు తిరుమల ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి. తిరిగి భక్తులకు స్వామి వారి దర్సనాలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తామో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలో అధికసంఖ్యలో భక్తులు ఇ-మెయిల్, వాట్సాప్, ఫోన్లల ద్వారా తమకు స్వామివారి లడ్డూ ప్రసాదం అయినా అందించాలని విజ్ఞప్తులు వచ్చాయన్నారు. 
 
భక్తుల అభ్యర్థనలు పరిగణలోకి తీసుకుని, లాభనష్టాలను చూడకుండా 50 వేల నుంచి 20 వేల లడ్డూలను ఉంచనున్నట్లు తెలిపారు. కళ్యాణ మండపాల్లోని టిటిడి ఉద్యోగులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, పోలీసు, రెవిన్యూ అధికారుల సమన్వయంతో భౌతిక దూరం పాటిస్తూ భక్తులకు లడ్డూ ప్రసాదాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విశాఖపట్నం, గుంటూరు, క్రిష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు రెండు లారీలలో లడ్డూప్రసాదాలు బయలుదేరాయని సోమవారం నుంచి భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23-05-2020 శనివారం దినఫలాలు - పద్మనాభ స్వామిని ఆరాధిస్తే...