Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆలయంలో ఇక పరకామణి సేవలుండవా? హుండీ కానుకల లెక్కింపు ప్రైవేట్ చేతికి?

కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామికి వచ్చే కానుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవారి హుండీలో రోజుకే కోట్లాది రూపాయలు కానుకగా వచ్చిపడుతుంటాయి. ఈ హుండీల

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (10:30 IST)
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామికి వచ్చే కానుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవారి హుండీలో రోజుకే కోట్లాది రూపాయలు కానుకగా వచ్చిపడుతుంటాయి. ఈ హుండీలో పడిన డబ్బును లెక్కించే ప్రక్రియను ఇన్నాళ్లు టీటీడీ ఆధ్వర్యంలోనే జరిగేది. అయితే తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. 
 
కోట్లాది మంది భక్తులు నిత్యమూ వెంకన్నకు సమర్పించుకునే హుండీ కానుకలను లెక్కించే బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ప్రస్తుతం హుండీలో పడే కరెన్సీ, బంగారు, వెండి కానుకల మదింపును టీటీడీ ఆధ్వర్యంలో రిటైర్డ్ ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగులు లెక్కిస్తుంటారు. వీరిని పరకామణి సేవకులుగా పిలుస్తారు. 
 
అయితే ఇక పరకామణి లెక్కింపు బాధ్యతలను ప్రైవేట్ ఏజన్సీకి అప్పగించేందుకు రంగం సిద్ధమవుతుంది. కానీ టీటీడీ నిర్ణయాన్ని భక్తులు తప్పుబడుతున్నారు. ఇప్పటికే కానుకల లెక్కింపు బాధ్యతలను చేపట్టేందుకు టీటీడీ ఉద్యోగులు ఆసక్తి చూపించడం లేదని చెబుతూ పాలక మండలి ప్రైవేటు ఏజన్సీని తెరపైకి తెచ్చింది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments