Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి క్షేత్ర వైభవాన్ని తెలిపే టేబుల్ బుక్.. ఎలా ఉంటుందంటే?

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (23:06 IST)
తిరుమల క్షేత్ర వైభవాన్ని, ప్రాశస్త్యాన్ని కళ్లకు కట్టినట్లు తెలిపే కాఫీ టేబుల్ బుక్ టీటీడీ మొట్టమొదటి సారిగా ఆవిష్కరించబోతుంది. తమిళనాడుకు చెందిన ఆర్కెటిక్ మరియు ఫోటోగ్రఫీలో నిపుణులైన రమణన్, వ్రిందా దంపతులు  రూపొందించిన మొదటి కాపీని ఇవాళ శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు. 
 
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల పుణ్యక్షేత్రం గురించి సుస్పష్టంగా, ఆకట్టుకునేలా తిరుమల తిరుమల దేవస్థానం మొట్టమొదటి సారి కాఫీ టేబుల్ బుక్‌ని భక్తుల కోసం తీసుకొస్తుంది. ఆ పుస్తకంలో క్షేత్ర చరిత్ర, స్థల పురాణం, భక్తాగ్రేసులైన ఆళ్వార్లు సేవలు, భక్తుల నమ్మకాలు, స్వామివారి ఉత్సవాలు ఇలా నాటి నుండి నేటి వరకు తిరుమల దినదినాభివృద్ధి చెందిన తీరుతో పాటు ప్రతి ఒక్క అంశాలతో కూడా ఐదు వందల పేజీల కాఫీ టేబుల్ బుక్‌ను కలియుగ వైకుంఠం పేరుతొ  తమిళనాడు రాష్ట్రం శ్రీరంగంకు చెందిన రమణన్, వ్రిందా అనే దంపతులు రూపొందించారు.
 
ఇప్పటివరకు కూడా మన దేశానికి సంబంధించి రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి కార్యాలయం, రాష్ట్ర అసెంబ్లీలు, పురాతన రాజకోటలకు మాత్రమే కాఫీ టేబుల్ బుక్ ఉందని మనకు తెలుసు. అయితే ప్రపంచంలోని కోట్లాది మంది భక్తులు ఉన్న తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన విశేషాలతో కూడిన ఒక కాఫీ టేబుల్ బుక్‌ను రూపొందించే అదృష్టం తమకు కలగడం చాలా ఆనందంగా ఉందంటున్నారు బుక్‌ని రూపొందించిన ఆ దంపతులు.
 
టిటిడి మాజీ అనిల్ కుమార్ సింఘాల్ హయాంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఇటీవల కాలంలో పూర్తి చేశారు. మొదట ప్రచురణను ఇవాళ తిరుమలకు తీసుకొచ్చి స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు, అనంతరం ప్రస్తుత ఈఓ జవహర్ రెడ్డికి బుక్‌ని చూపించగా, ఆయన ఆ పుస్తకం డిజైన్లు చూసి అందులో ఉన్న విశేషాలను పూర్తిగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ యేడాది ఉగాది రోజున ఈ పుస్తకాన్ని తిరుమలలో టీటీడీ అధికారుల చేతుల మీదుగా ఆవిష్కరించబోతున్నట్లు వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

అన్నీ చూడండి

లేటెస్ట్

హనుమజ్జయంతి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి?

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

తర్వాతి కథనం
Show comments