Webdunia - Bharat's app for daily news and videos

Install App

200 మంది వేదపండితులు ఒకేచోట పారాయణంతో కరోనాను పాలద్రోలితే

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (17:30 IST)
అశేష భక్తలోకాన్ని అమితంగా ఆకట్టుకుంటున్న సుందరకాండ పారాయణం మరో బృహత్తర అంకానికి సిద్థమైంది. కరోనా వేళ విపత్తులు తొలగి ధైర్యంతో ముందడుగు వేయడానికి తిరమల తిరుపతి దేవస్థానములు ప్రసిద్థ వేదపండితులతో సుందరకాండ పారాయణాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే
 
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా తిరుమల నాదనీరాజనం వేదిక నుంచి ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం తొలిసర్గ పూర్తి చేసుకునన సంధర్భంగా మొదటి సర్గలోని మొత్తం శ్లోకాలను 200మంది వేదపండితులు జూలై 7వతేదీన ఏకకాలంలో పఠించగా భక్తులందరూ తమ తమ ఇళ్ళలో ఎస్వీబీసీ ఛానళ్ళలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ తామూ శృతి కలిపి కృతార్థులయ్యారు. 
 
ఈ నేపథ్యంలో సుందరకాండలోని ద్వితీయ సర్గ నుంచి సప్తమ సర్గ వరకు ఉన్న మొత్తం 227శ్లోకాలను ఈనెల 6వతేదీన సుమారు 200మంది వేదపండితులు అఖండ పారాయణం చేయనున్నారు. తిరుమల నాదనీరాజన వేదిక ప్రాంగణంలో జరిగే ఈ సుందరకాండ అఖండ పారాయణంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేధాధ్యయన సంస్ధ, తిరుమల ధర్మగిరి వేదపాఠశాలకు చెందిన వేదపండితులు పాల్గొని ఏకకాలంలో 227 సుందకాండ శ్లోకాలను పారాయణం చేస్తారు.
 
భక్తులందరూ రేపు గురువారం ఉదయం 7 గంటల నుంచి జరిగే ఈ అఖండ పారాయణాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి తమ ఇళ్ళ నుంచే తాము పారాయణం చేసి తిరుమలేశుని అనుగ్రహాన్ని పొందాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. ముఖ్యంగా కరోనా వైరస్ అంతరించిపోవాలని ఈ కార్యక్రమాన్ని టిటిడి నిర్వహిస్తోంది. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

తర్వాతి కథనం
Show comments