భ‌క్తుల‌కు అందుబాటులో ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం టికెట్లు

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (21:13 IST)
తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆన్‌లైన్ వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం టికెట్ల‌ను మంగ‌ళ‌వారం నుండి టిటిడి భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచింది. భ‌క్తుల కోరిక మేర‌కు తిరుమల శ్రీవారి ఆల‌యం త‌ర‌హాలో ఇక్క‌డ ఆన్‌లైన్ విధానంలో క‌ల్యాణోత్స‌వం నిర్వ‌హిస్తారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఆల‌యాల్లో ఏకాంతంగా ఆర్జిత సేవ‌లు నిర్వ‌హిస్తున్న విషయం తెలిసిందే.
 
వారంలో సోమ‌వారం నుండి శుక్ర‌వారం వ‌ర‌కు క‌ల్యాణోత్స‌వం టికెట్లు ఆన్‌లైన్‌లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్ ధ‌ర రూ.500/-గా నిర్ణ‌యించారు. గృహ‌స్తులు ఆన్‌లైన్‌లో ఈ టికెట్ల‌ను బుక్ చేసుకుని ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా క‌ల్యాణోత్స‌వాన్ని వీక్షించ‌వ‌చ్చు.
 
ఆ త‌రువాత 90 రోజుల్లోపు గృహ‌స్తులు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని రూ.100/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం క్యూలైన్‌లో ఉచితంగా ద‌ర్శించుకునే అవ‌కాశం క‌ల్పించారు. ద‌ర్శ‌నానంత‌రం ఉత్త‌రీయం, ర‌విక‌, అక్షింత‌లు ప్ర‌సాదంగా అందిస్తారు. tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా భ‌క్తులు ఆన్‌లైన్ క‌ల్యాణోత్స‌వం టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cyclone Montha: మొంథా తుఫాను.. ఏపీ రౌండప్.. సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటే అవకాశం

Cobra: పుట్టపై నాగుపాము ప్రత్యక్షం.. భయం లేకుండా పూజలు చేసిన భక్తులు (video)

కిరాతకుడిగా మారిన బీజేపీ నేత.. రైతును హత్య చేసి.. కుమార్తెను..?

అల్బేనియా ఏఐ మంత్రి డియోల్లా గర్భం దాల్చింది.. 83 మంది ఏఐ పిల్లలు పుట్టబోతున్నారట! (video)

పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంద్రకీలాద్రిపై నాగుల చవితి వేడుకలు.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో?

26-10-2025 ఆదివారం దినఫలాలు - ప్రయాణంలో అవస్థలు ఎదుర్కుంటారు...

26-10-2025 నుంచి 02-11-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

karthika somavaram కార్తీక సోమవారం ఈశ్వరుణ్ణి పూజిస్తే సత్వరమే ప్రసన్నం

25-10-2025 శనివారం దినఫలాలు - గ్రహాల సంచారం అనుకూలం

తర్వాతి కథనం
Show comments