ఆ భాగ్యం ఇన్నాళ్లకు దక్కింది... తితిదే ఈవో జవహర్ రెడ్డి

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (19:31 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంటూ ఆయనకు సేవ చేసుకునే భాగ్యం ఇన్నాళ్లకు దక్కిందని తితిదే కొత్త ఈవోగా నియమితులైన ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆయన టీటీడీ ఈవోగా శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
 
తితిదే ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి, ఆయన స్థానంలో జవహర్ రెడ్డిని నియమించిన విషయం తెల్సింది. ఈయన ఇప్పటివరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. అనిల్‌ సింఘాల్‌ను బదిలీ చేసిన సమయంలోనే టీటీడీ ఈవోగా జవహర్‌ ‌రెడ్డిని ప్రభుత్వం నియమించబోతుందనే వార్తలు వచ్చాయి. 
 
దీనిపై జవహర్ రెడ్డి స్పందిస్తూ, శ్రీవారికి సేవ చేసుకునే భాగ్యం ఇన్నాళ్ళకు దక్కిందని చెప్పుకొచ్చారు. ఇకపోతే,  వైద్య ఆరోగ్యశాఖలో నాడు- నేడు కార్యక్రమం కొత్త ఒరవడి సృష్టిస్తోందని, ఈ కార్యక్రమంలో తాను భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని జవహర్‌రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: హైదరాబాద్‌ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు

పోలీసులే దొంగలుగా మారితే.... దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు....

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

అన్నీ చూడండి

లేటెస్ట్

కలలో ప్రియురాలు నవ్వుతూ మీ వెనుకే నడుస్తున్నట్లు కనిపిస్తే...?!!

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

Godess Lakshmi : మార్గశిర పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే..?

04-12-2025 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

జై గురుదత్త

తర్వాతి కథనం
Show comments