Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాశివరాత్రి రోజున బిల్వార్చన చేస్తే? శివ‌ మ‌హ‌త్మ్యం చెప్పే క‌థ‌

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (10:00 IST)
శివుడు అభిషేక ప్రియుడు. భ‌క్తులు శివ‌రాత్రి రోజున ల‌క్ష బిల్వార్చ‌న చేసి, భ‌క్తితో పూజించి, అభిషేకిస్తే శివానుగ్ర‌హానికి పాత్రుల‌వుతారు. పంచాక్ష‌రీ మంత్ర జ‌పంతో పునీతుల‌వుతారు. పూజా విధానం, మంత్రాలు తెలియ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఉప‌వాసం, జాగ‌ర‌ణ‌, బిల్వార్చ‌న‌, అభిషేకం వంటి పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటే శివానుగ్ర‌హం ల‌భిస్తుంద‌ని వేద పండితులు చెబుతున్నారు. శివరాత్రి మహాత్మ్యాన్ని చాటి చెప్పే కథ ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉంది.
 
కాశీలో ఉండే సుస్వ‌రుడు అనే బోయ‌వాడు ఒక‌రోజు అడవిలో దారి త‌ప్పిపోతాడు. చీక‌టి ప‌డే స‌మ‌యానికి ఒక బిల్వ వృక్షం ద‌గ్గ‌ర‌కు చేరుకుంటాడు. ఆ రోజంతా నిద్ర పోకుండా త‌న కోసం ఇంటి ద‌గ్గ‌ర ఎదురుచూసే భార్య‌, పిల్ల‌ల‌ను త‌ల‌చుకుని బాధ‌ప‌డుతుంటాడు. 
 
ఆ రాత్రి ఏం చేయాలో, ఎటు వెళ్లాలో తెలియ‌క బిల్వ వృక్షం కొమ్మ‌లకు ఉన్న ఆకుల‌ను ఒక్కొక్క‌టిగా తెంపి కింద ప‌డేస్తుంటాడు. ఆ ఆకులు చెట్టు కింద ఉన్న శివ‌లింగ‌పై పడ‌తాయి. ఆ మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే నుస్వ‌రుడు ఇంటికి చేరుకుంటాడు. కాలాంతంలో అత‌ను మ‌ర‌ణించి శివుడి స‌న్నిధికి చేరుకుంటాడు.
 
బోయ‌వాడు అడ‌విలో దారి త‌ప్పిన రోజు మ‌హాశివ‌రాత్రి. ఆ రోజు రాత్రంతా భోజనం చేయ‌కుండా జాగారం చేయ‌డమే కాకుండా, త‌న క‌న్నీటితో శివ‌లింగానికి అభిషేకం చేసి, బిల్వ ప‌త్రాల‌తో అర్చించ‌డం వ‌ల్ల అత‌ను శివ‌సాయుజ్యం చేరుకున్నాడు. అలా బోయ‌వాడు శివ‌రాత్రి మ‌హాత్మ్యం తెలియ‌క‌పోయినా యాదృశ్చికంగా జ‌రిగిన పూజా ఫ‌లాన్ని పొందాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్- ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయి.. ఐఫోన్ పార్ట్స్?

TDP: జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం.. చంద్రబాబు నాయుడు ప్రకటన

నర్మాలలో కలిసిన ఆ ఇద్దరు.. కరచాలనం చేసుకున్న కేటీఆర్-బండి సంజయ్ (video)

చంద్రబాబు బాటలో పవన్-ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి.. ర్యాంకులు కూడా ఇస్తారట

Brain cells: పనిపిచ్చి ఎక్కువ గల వారు మీరైతే.. ఇక జాగ్రత్త పడండి...

అన్నీ చూడండి

లేటెస్ట్

Ganesh Chaturthi 2025: గణేశ చతుర్థి రోజున విరిగిన విగ్రహాన్ని ఇంటికి తేవడం..?

25-08-2025 సోమవారం ఫలితాలు - ఒప్పందాల్లో జాగ్రత్త.. ఏకపక్ష నిర్ణయాలు తగవు...

Ganesh Chaturthi 2025: వక్రతుండ మహాకాయ

గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి?

24-08-2025 నుంచి 30-08-2025 వరకు మీ వార ఫలితాల - వృత్తి ఉద్యోగాల్లో రాణింపు...

తర్వాతి కథనం
Show comments