Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహాశివరాత్రి ఉపవాసం వుంటే.. ఇవి తినకూడదట..

Advertiesment
మహాశివరాత్రి ఉపవాసం వుంటే.. ఇవి తినకూడదట..
, బుధవారం, 10 మార్చి 2021 (12:04 IST)
మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగారం తప్పనిసరి. శివరాత్రికి ముందు రోజు ఒకవేళ భోజనం చేసి.. సుఖభోగాలకు దూరంగా వుండాలి. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందు నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి.. సూర్య నమస్కారం చేయాలి. శివపూజ చేయాలి. ఆపై ఆలయాల్లో శివ దర్శనం చేసుకోవాలి. ధ్వజస్తంభం లేని ఆలయంలో సాష్టాంగ నమస్కరించకూడదు.
 
మహాశివరాత్రి రోజున శివకథలు వింటూ జాగరణ చేయాలి. అలాగే రథరాత్రి మూడు, నాలుగో జాములో మరోసారి ఆహుతులను సమర్పించాలి. తెల్లవారున శివ భక్తులకు అన్న వస్త్రాలు, ఛత్రం ధానం చేయాలి. ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతాలతో అభిషేకం చేయాలి. వీలైతే ఆలయాల్లో జరిగే పూజల్లో పాలు పంచుకోవచ్చు.
 
మహా శివరాత్రి రోజున ప్రాతఃకాలాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి. సూర్యోదయం వరకూ మౌనవ్రతం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. వ్రతం పాటిస్తే గనక శివరాత్రి రోజున వరి అన్నం, గోధుమలు, పప్పులు వంటివి తినకూడదు. వాటి బదులు పండ్లు, పాలు వాడాలి. చాలా మంది భక్తులు రాత్రంతా పూజ చేస్తారు. ఎంత నిష్టగా చేస్తే అంత మంచి ఫలం దక్కుతుందని ప్రతీతి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహా శివరాత్రి మృత్యుంజయ మంత్రాన్ని.. పంచాక్షరిని వదిలిపెట్టొద్దు..!