Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

మహా శివరాత్రి మృత్యుంజయ మంత్రాన్ని.. పంచాక్షరిని వదిలిపెట్టొద్దు..!

Advertiesment
Maha shivaratri 2021
, బుధవారం, 10 మార్చి 2021 (05:00 IST)
ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్ధశి రోజు వచ్చేదే మహా శివరాత్రి.. ఇది శివునికి అత్యంత ఇష్టమైనది. శివుడు సర్వ శక్తి సంపన్నుడై లింగాకారంలో ఆవిర్భవించిన రోజును మహాశివరాత్రి అంటారు. ఇదే రోజు శివుడు, పార్వతిదేవి వివాహం జరిగిందని కూడా అంటారు. ఈ రోజున చాలామంది ఉపవాసం, జాగరణ చేస్తారు. ఇలా చేయడం ఆనవాయితీగా వస్తుంది.
 
రోజంతా ఏం తినకుండా.. జాగరణ చేస్తూ భక్తులు శివుడిని కొలుస్తారు. శివుడు అభిషేక ప్రియుడు, ఉపవాసం, జాగరణలను ఎంతగానో ఇష్టపడతాడు. ముక్కంటి కంఠంలో కాలకూట విషం ఉంది కాబట్టి.. దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని, చల్లని నీటితో అభిషేకం చేయడం వల్ల ఆయన శరీరం చల్లగా మారుతుందట. మహా శివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి. 
 
నేలపై నిద్రించడం, సాత్విక ఆహారం తీసుకోవడం, ఒక్కపూట భోజనం, శారీరక, మానసికంగా శుద్ధిగా ఉండాలి. కోపతాపాలు, ఇతరులు నిందించడం వంటివి చేయనే కూడదు. ఈ రోజు శివలింగానికి రుద్రాభిషేకం చేయించడం మంచిది. రోజంతా శివ పంచాక్షరి మంత్రం ‘ఓం నమ: శివాయ’ అంటూ ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. 
 
అలాగే ''ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్త్ర ||" అంటూ మహా మృత్యుంజయ మంత్రాన్ని శివరాత్రి రోజు జపిస్తే సకల రోగబాధలూ తగ్గి పూర్ణాయుష్షు లభిస్తుందని పండితులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళవారం.. హనుమంతుడికి 108 వెండి తమలపాకుల పూజ చేస్తే..?