Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరికాయ కొట్టాక అందులో పువ్వు కనబడితే ఏమవుతుంది?

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (18:02 IST)
పూజ చేసేటపుడు మనం కొబ్బరికాయలు కొడుతుంటాం. చాలాసార్లు కొబ్బరికాయలు మంచివిగానే వుంటాయి. కానీ కొన్నిసార్లు కొబ్బరికాయ కుళ్లిపోయినది వస్తుంది. కొబ్బరికాయ కొట్టగానే కుళ్లిపోయిందే అని గాభరా పడతారు చాలామంది. నిజానికి పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమేమికాదని అంటున్నారు జ్యోతిష నిపుణులు. 
 
ఇది మనం తెలిసి చేసిన పని కాదు కనుక దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రం చేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు. అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరికాయదే కాని ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం.
 
అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ క్రుళ్ళితే క్రుళ్ళిన భాగాన్ని తీసేసి కాళ్ళూ, చేతులూ, ముఖమూ కడుగుకొని పూజామందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించటం మంచిది. వాహనాలకి కొట్టే కాయ క్రుళ్ళితే దిష్టి అంతా పోయినట్టే. అయినాసరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి.
 
అలాగే కొబ్బరికాయ కొట్టినప్పుడు కొన్ని కొబ్బరికాయల్లో పువ్వు కనిపిస్తుంది. ఇలా పువ్వు కనబడినా కొందరు ఆందోళన పడతారు. కానీ కొబ్బరికాయలో పువ్వు కనబడితే సంతానభాగ్యం అనే విశ్వాసం వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తన పుట్టుకనే శంకించారు... వైఎస్ఆర్‌కు పుట్టలేదంటూ ప్రచారం.. వైఎస్ షర్మిల

ఉన్నపరువు పోతుందని ఎమ్మెల్సీ ఎన్నికలకు వైకాపా దూరం!!

కుమార్తెకు గ్యాస్ సిలిండర్ ఇచ్చిన భార్య.. హత్య చేసిన భర్త...

విద్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం జాతీయ అభివృద్ధికి కీలకం

అసెంబ్లీకి రాను, మీడియా ముందు ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నిస్తా: వైఎస్ జగన్

అన్నీ చూడండి

లేటెస్ట్

నాగుల చవితి: పుట్టలో పాలు, పూజ ఎలా చేయాలి.. ఈ శ్లోకం.. ఈ మంత్రం చదివితే?

05-11-2024 మంగళవారం ఫలితాలు : కార్యసాధనలో సఫలీకృతులవుతారు...

మీ దగ్గర తీసుకున్న డబ్బు ఎవరైనా ఇవ్వకపోతే..?

విశాఖ నక్షత్రంలోకి సూర్యుని పరివర్తనం.. 3 రాశులకు అదృష్టం

కార్తీకమాసంలో ఛట్ పూజ.. సూర్యునికి ఇలా అర్ఘ్యమిస్తే.. రాగి నాణేలను..?

తర్వాతి కథనం
Show comments