ఉసిరికాయ చూర్ణంలో నువ్వుల చూర్ణం, నెయ్యి కలుపుకుని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే జ్ఞాపక శక్తిని పెంచుటకు మంచిగా ఉపయోగపడుతుంది. కంటిచూపును మెరుగుపరచుటకు ఉసిరికాయ రసం దివ్యౌషధంగా పనిచేస్తుంది.
అలర్జీ, దద్దుర్లు వంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఉసిరి చూర్ణంలో కొద్దిగా కొబ్బరినూనెను కలుపుకుని ఆ ప్రాంతాల్లో రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
3 గ్రాముల ఉసిరి గింజలను నీటిలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో తేనె, పటిక బెల్లం కలుపుకుని తాగితే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.